బిగ్ బాస్‌కు వెళ్లితే కెరీర్ క్లోజ్ అవుతుందా? మాజీ కంటెస్టెంట్ షాకింగ్ సమాధానం!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. స్టార్ మా ఇప్పటికే వరుస ప్రోమోలతో ఈ సీజన్‌పై అంచనాలను పెంచేస్తుండగా, మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సీజన్‌లో ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తారు? ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి? అనే చర్చలతో సోషల్ మీడియా సందడిగా మారింది. అయితే బిగ్‌బాస్ గురించి ప్రతి సీజన్‌లో వినిపించే ఒక కామన్ అభిప్రాయం ఉంది. "బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత కెరీర్ క్లోజ్ అయిపోతుంది", "ఆ షో నుంచి బయటకు వచ్చిన వాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయి" అనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ అపోహలపై తాజాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ జోర్దార్ సుజాత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జోర్దార్ సుజాత పాల్గొన్నారు. ఆ సందర్బంగా తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంది. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదా సపోర్ట్ లేదని, కేవలం ఆడిషన్‌ల ద్వారానే అవకాశాలు సంపాదించుకున్నానని వెల్లడించారు. "నిజానికి నేను కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలని సిటీకి వచ్చాను. కానీ నా భాష, మాట్లాడే తీరు బాగుందని కొందరు మీడియా వైపు వెళ్లమని సూచించారు. అలా ఒక ఆడిషన్‌కు వెళ్లగా తొలి ప్రయత్నంలోనే అవకాశం వచ్చింది. జోర్దార్ కార్యక్రమంతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే పేరు నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది" అని సుజాత తెలిపారు.

Bigg Boss Telugu Jordar Sujatha Breaks Silence on Career Rumours After Bigg Boss Journey

జోర్దార్ షోతో వచ్చిన గుర్తింపే తనను బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 వరకు తీసుకెళ్లిందని సుజాత చెప్పారు. బిగ్‌బాస్ తర్వాత తనకు సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, టెలివిజన్ షోలు ఇలా వరుస అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. "బిగ్‌బాస్ నా కెరీర్‌కు మైనస్ కాలేదు. ఆ షో వల్లే మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యాను. ఆ తర్వాత వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా బిజీగా ఉన్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మళ్లీ అవకాశం వస్తే బిగ్‌బాస్‌లో పాల్గొంటారా? అని ప్రశ్నించగా సుజాత నవ్వుతూ స్పందించారు. "అమ్మో... ఇప్పుడు అస్సలు వెళ్లను. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, చిన్న పాప ఉంది. షూటింగ్‌కి వెళ్లడమే కష్టంగా అనిపించే పరిస్థితి. అలాంటిది నెలల తరబడి ఇంటికి దూరంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండడం ఇప్పుడు సాధ్యం కాదు" అని స్పష్టం చేశారు.

బిగ్‌బాస్ ప్రయాణం తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని కూడా సుజాత తెలిపారు. "అప్పటి వరకు నేను చాలా చిన్న ప్రపంచంలో జీవించేదాన్ని. బిగ్‌బాస్‌లో వివిధ వ్యక్తులతో కలిసి ఉండడం ద్వారా మనుషులతో ఎలా మెలగాలి? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? భిన్నమైన వ్యక్తిత్వాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడాను" అని చెప్పారు. బిగ్‌బాస్ తర్వాత కెరీర్ ముగిసిపోతుందనే ప్రచారంపై జోర్దార్ సుజాత గట్టిగానే స్పందించారు. "ఏ అవకాశం వచ్చినా దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. బిగ్‌బాస్ మీకు ఒక వేదిక మాత్రమే ఇస్తుంది. ఆ వేదికను ఉపయోగించి ముందుకు వెళ్లాలా? లేక అక్కడే ఆగిపోవాలా? అనేది వ్యక్తిగత ప్రతిభ, కష్టపడి పనిచేసే తీరు, అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు.

"బిగ్‌బాస్ వల్ల కెరీర్ ముగిసిపోతుందని చెప్పడం పూర్తిగా తప్పు. నా లాగే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చి మంచి స్థాయికి చేరుకున్నవారు చాలామంది ఉన్నారు. షో ఒక అవకాశం మాత్రమే. దాన్ని సక్సెస్‌గా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది షో తప్పు కాదు.. వ్యక్తి లోపమే" అంటూ సుజాత తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి బిగ్‌బాస్‌పై ఉన్న "కెరీర్ క్లోజ్" అనే ప్రచారాన్ని జోర్దార్ సుజాత పూర్తిగా ఖండించారు. షోను సరైన విధంగా ఉపయోగించుకుంటే అది కెరీర్‌కు కొత్త దారులు తెరుచుకుంటాయని చెప్పింది. విజయం సాధించడం అనేది వ్యక్తి ప్రతిభ, కృషి, అవకాశాలను ఎలా మలుచుకుంటాడన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని సుజాత స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X