For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చంద్రముఖి వస్తే ఈ దుర్గాష్టమికి అదే.. కామంతో రెచ్చిపోయిన అవినాష్.. పీకినవ్ తీయ్ అంటూ దేత్తడి కౌంటర్

  |

  బిగ్ బాస్ హౌజ్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రెగ్యులర్ గా ఉంటే రొటీన్ అవుతోందని అనుకున్నారో ఏమో గాని ఒక్కసారిగా వాతావరణాన్ని చేంజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ ని ఈ రోజు బూత్ బంగ్లా మాదిరిగా మార్చేసినట్లు అర్ధమవుతోంది. కొత్త తరహా సెట్స్ తో హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రోగ్రామ్ ను సెట్ చేశారు. ఇక అవినాష్ రెచ్చిపోయి షాక్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసిన స్టార్ మా ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

   హారర్ జోన్ లో బిగ్ బాస్ ఎపిసోడ్స్

  హారర్ జోన్ లో బిగ్ బాస్ ఎపిసోడ్స్

  బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికి నుంచి కూడా నిర్వాహకులు కాస్త హారర్ కలరింగ్ ఎక్కువగానే ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. సోమవారం శవాల పేటికలో నామినేషన్ ప్రక్రియను కొనసాగించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత పొలిటికల్ తరహాలో అవినాష్, అఖిల్ కాస్త సందడి చేశారు.

  భయాన్ని కలిగించే

  భయాన్ని కలిగించే

  ఇక బుధవారం ఎపిసోడ్ లో మళ్ళీ భయాన్ని కలిగించే ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని కొత్త తరహా సెట్స్ ని యాడ్ వేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేయగా సోహెల్ అయితే నేను బయపడను అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక హారిక బాత్రూమ్ డోర్ తెరచుకోవడం లేదని బిగ్ బాస్ కి వివరణ ఇచ్చింది.

  బాత్రూమ్ డోర్ తెరిస్తే పని చూసుకుంటాం

  బాత్రూమ్ డోర్ తెరిస్తే పని చూసుకుంటాం

  మచ్చా జర బాత్రూమ్ డోర్ తెరిస్తే పని చూసుకుంటాం అంటూ కెమెరా ముందు మాట్లాడుతుండగా సడన్ గా ఎదో శబ్దం ఆమెను వణికించింది. ఇక నిమిషం నిమిషం వింత వింత శబ్దాలు వస్తుండడంతో అరియానా చిన్న పిల్లలా భయపడినట్లు కనిపించింది. అనంతరం సోహెల్ అయితే కెమెరా ముందుకు చూస్తూ హలో దెయ్యం ఎక్కడున్నావ్ అంటూ.. భయపడతారు అనుకుంటున్నారా? అలా రాత్రి మాత్రం రాకండి అని సరదాగా జోక్ చేశాడు.

  పీకినవ్ తీయ్ అంటూ హారిక కౌంటర్

  పీకినవ్ తీయ్ అంటూ హారిక కౌంటర్

  ఇక హౌజ్ లో ఎక్కువగా భయపడుతూ కనిపించిన కంటెస్టెంట్ అరియానా. ప్రతి సౌండ్ కి ఆమె వణికిపోతోంది. అయితే హారిక ఆమెకి కౌంటర్ ఇచ్చింది. ప్రతి దానికి భయపడితే వాళ్ళు నీ మీదనే ఫోకస్ చేసి ఇంకా భయపెడతారని చెప్పింది. అందుకు అరియానా నేను ఏమి భయపడటం లేదని చెప్పడంతో.. హారిక పీకినవ్ తీయ్ అంటూ మరో షాకింగ్ కౌంటర్ ఇచ్చింది.

  ఈ దుర్గాష్టమికి నిన్ను.. కామంతో అవినాష్

  ఈ దుర్గాష్టమికి నిన్ను.. కామంతో అవినాష్

  ఇక అవినాష్ కామెడీ ట్రాక్ ఈ ఎపిసోడ్ లో గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది. ఆ మిర్రర్ లో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి గుంజుకపోవాలి అని హారిక అనడంతో అందుకు అవినాష్ లాక్ రాగానే రెండు చేతులకు నేయిల్ పాలిష్ పెట్టేస్తానని మరో కామెడీ కౌంటర్ వేశాడు. అలాగే అవినాష్ చంద్రముఖి డైలాగ్ తో మరింతగా ఆకట్టుకున్నాడు. నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కామ ఆలోచనలను బయటపెట్టాడు. దీంతో హౌజ్ మెంట్స్ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే హే అవినాష్ అని ఒక లేడి దెయ్యంలా సౌండ్ వచ్చింది. అనంతరం వస్తా.. అంటూ గట్టిగా అరిచేసింది.

  Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
  దెయ్యం దెబ్బకు దడుచుకున్న బోల్డ్ గర్ల్

  దెయ్యం దెబ్బకు దడుచుకున్న బోల్డ్ గర్ల్

  ఇక ఫైనల్ గా కిచెన్ లో ఉన్న అరియానాకు ఒక మిర్రర్ లో దెయ్యం కనిపించింది. దెబ్బకు బోల్డ్ గర్ల్ దడుచుకుంది. అందరూ పరిగెత్తుకుంటు ఆమె వద్దకు వచ్చేశారు. ఏమైంది ఏమైంది అని అడిగే ప్రయత్నం చేసినప్పటికి అరియానా భయంతోనే కనిపించింది. దెయ్యం ఉంది అంటూ ఎడిచేసింది. ఇక హౌజ్ మెంట్స్ మోహల్లో అప్పుడు ఒక కొత్త తరహా భావాలు కనిపించాయి. ఇక ఫైనల్ గా ఈ భయం వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏమిటో తెలియాలి అంటే ఈ రోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.

  English summary
  Whether or not she received such a craze as an anchor, Ariana gave herself the title of Bold Girl. The hustle and bustle in this young girl's house, which was seen with the entry of Bigg Boss 4th season, is not normal. Trying to impress with the daily comedy task is not going to be a workout in the range as expected either. There have already been a lot of satires on her voice.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X