For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Leak: బిగ్‌బాస్ మరో సూపర్ ట్విస్టు.. అవినాష్‌కు బంపర్ ఛాన్స్.. మూడు వారాలు గ్యారంటీ!

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించి 12వ వారం ఆరంభం నుంచే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టోపి టాస్కుతో ఇంటి సభ్యులను నామినేషన్‌లో ఇరికించిన బిగ్‌బాస్ వారికి వెంటనే కొంత ఉపశమనం ఇచ్చేకుందుకు స్వాపింగ్ ప్రాసెస్‌ను తెరపైకి తెచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మంగళవారం ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ గేమ్‌లో గెలిచిన వారికి ఇమ్యునిటీ ఉంటుందని తాయిలం ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఏం జరిగిందంటే..

    12వ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో

    12వ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో

    12వ వారంలో ఇంటి సభ్యుల్లోని ఏడుగురిలో నలుగురు నామినేషన్‌లోకి వెళ్లారు. తొలుత అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా నామినేషన్ జాబితాలోకి చేరారు. అయితే నామినేట్ కాని ఇంటి సభ్యులను మెప్పించి నామినేషన్‌ను స్వాపింగ్ చేసుకోవచ్చని సూచించారు. అది వర్కవుట్ కాకపోవడంతో కెప్టెన్ హారికకు సూపర్ పవర్ ఇవ్వడంతో అభిజిత్‌ను మోనాల్‌తో స్వాపింగ్ చేసింది. దాంతో చివరకు మోనాల్, అఖిల్, అవినాష్, అరియానా నామినేషన్ లిస్టులోకి చేరారు.

    నామినేటేడ్ కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్

    నామినేటేడ్ కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్

    ఇక నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అందుకు ఓ గేమ్‌ను సూచించి అందులో గెలిస్తే.. ఈ వారానికి కాకుండా వచ్చే వారానికి ఇమ్యునిటి లభిస్తుందని, వచ్చే వారం నామినేషన్‌ నుంచి మినహాయింపు ఉంటుందని గేమ్ రూల్ సూచించాడు. ఆ గేమ్ ప్రకారం ఇంటిలోని పలు ప్రాంతాల్లో దాచి ఉన్న జెండాలను ఎక్కువ సేకరించి విజేతగా నిలిస్తే ఇమ్యునిటీ లభిస్తుందని తెలిపారు

    బిగ్‌బాస్ ఆడించిన గేమ్‌లో అవినాష్ విజేతగా

    బిగ్‌బాస్ ఆడించిన గేమ్‌లో అవినాష్ విజేతగా

    ఇంటిలో గేమ్‌ ప్రారంభం కాగానే మోనాల్, అఖిల్, అవినాష్, అరియానా పరుగులు పెట్టి జెండాలను సేకరించే పనిలో పడ్డారు. మోనాల్‌కు హారిక, అభిజిత్ మద్దతు తెలుపగా.. అఖిల్‌కు సోహెల్ అండగా నిలిచాడు. ఇలా గేమ్‌లో ఉరుకులు పరుగులు పెడుతూ ఇంటి సభ్యులు జెండాలను సేకరించారు. అయితే ఈ గేమ్‌లో ఎక్కువ జెండాలు సేకరించిన అవినాష్‌కు ఇమ్యునిటీ లభించినట్టు సమాచారం.

    వచ్చేవారం అవినాష్‌కు ఊరట

    వచ్చేవారం అవినాష్‌కు ఊరట

    దాంతో అవినాష్‌కు కొంత ఊరట లభించింది. ఒకవేళ ప్రస్తుత వారంలో నామినేషన్ నుంచి తప్పించుకొని గట్టెక్కితే వచ్చే వారం అవినాష్ ఎలాంటి ముప్పు ఉండదు. ఇమ్యునిటీ లభించిన కారణంగా వచ్చే వారం నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ కాకుండా ఉంటే కనీసం మూడు వారాలు ఇంట్లో ఉండే అవకాశం లభిస్తుంది. అయితే అవినాష్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారా వేచి చూడాల్సిందే.

    Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్

    మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్

    ఇక బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ విషయానికి వస్తే.. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే 79 రోజులు గడిచిపోయాయి. అంటే ఇంకా 26 రోజుల ఆట మిగిలి ఉంది. అయితే మూడు వారాలు అవినాష్ ఉన్నట్లయితే తప్పనిసరిగా బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో టాప్ 5కి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    English summary
    Bigg Boss Telugu Leak: Bigg Boss Telugu 4s 12th week Nomination list leak: As per reports, Monal Gajjar, Avinash, Ariana Glory, Akhil in the list for Elimination process. Ariana Glory request to Sohel to swap the nominations. Harika saved Abijeet with super power from Bigg Boss. Ariana Glory request to Syed Sohel Ryan to swap. Mukku Avinash Gets Immunity for 13th week
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X