twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 6: బిగ్​బాస్​ ఆరో సీజన్​లో కొత్త రూల్స్​.. మారిన నామినేషన్ ప్రక్రియ!

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ప్రారంభం అవుతుంది అన్నప్పుడు అనుకున్నంతగా సక్సెస్ కాదేమో అని అనుకున్నారు. కానీ యంగ్​ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్​తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో నాగార్జునతో 5 సీజన్స్ వరకు విజయవంతంగా కొనసాగింది. ఇక రాబోయే 6వ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సీజన్​లో సరికొత్తగా రూల్స్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ, శిక్షలను విభిన్నంగా ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పూర్తి విరాళ్లోకి వెళితే..

    ఇంకొన్ని రోజులే..

    ఇంకొన్ని రోజులే..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్​కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అత్యధిక పాపులారిటి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కోసం ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలు ఉంది. బిగ్​బాస్​ హౌస్‌లోకి ప్రవేశించే పోటీదారుల గురించి సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లోకి సింగర్​ రేవంత్, ఆర్జే సూర్య, ఆది రెడ్డి, శ్రీహాన్, గీతు రాయల్​, అభినయశ్రీ, నేహా చౌదరి, వాసంతి, బాలాదిత్య, శ్రీ సత్య వంటి తదితరుల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

    గ్రాండ్​గా ఆరో సీజన్​..

    గ్రాండ్​గా ఆరో సీజన్​..

    బిగ్ బాస్ గడిచిన 5 సీజన్స్ కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. యంగ్ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్ మొదటి హోస్ట్​గా ఆ తర్వాత నాని రెండో హోస్ట్​గా షోను ఎక్కడికో తీసుకువెళ్లారు. అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున విజయవంతంగా బిగ్ బాస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఓటీటిలో కూడా నాన్ స్టాప్ షోగా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే సంపాందించుకుంది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న 6వ సీజన్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

    ప్రధానమైన నామినేషన్ ప్రక్రియ..

    ప్రధానమైన నామినేషన్ ప్రక్రియ..

    ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ప్రధానమైనది. దాని ఆధారంగానే షో రంజుగా సాగుతుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్ ఇంకా ప్రధానమైనది. ఈ టాస్క్​ను ప్రతి సోమవారం ఉత్కంఠభరితంగా సాగిస్తారు. అయితే ప్రస్తుతం ఈ నామినేషన్స్​ ప్రక్రియ రోజును మారుస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

    నామినేషన్ ప్రక్రియలో మార్పు..

    నామినేషన్ ప్రక్రియలో మార్పు..

    ఈ క్రమంలోనే ఆరో సీజన్‌లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత జోరుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో జరుగుతుంది. కానీ, ఈ ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని సోమవారం చూపించడం లేదని టాక్​ వినిపిస్తోంది.

     కఠినంగా శిక్షలు..

    కఠినంగా శిక్షలు..

    అంతేకాదు, ఈ టాస్కును బుధవారం ప్రసారం చేయబోతున్నారు. అంతేకాకుండా చెత్త ప్రదర్శన చేసిన కంటెస్టెంట్ల శిక్షలు కూడా గత సీజన్​ కంటే భిన్నంగా ఉంటాయి. బిగ్​బాస్​ తెలుగు మేకర్స్​ ఇతర బిగ్​బాస్​ షోల నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీదారుల కోసం కొత్త టాస్క్‌లు ఈ సీజన్‌లో ఆసక్తికరంగా, కఠినంగా ఉంటాయి. ఇది బుల్లితెర వీక్షకులను వారి టీవిలకు అతుక్కుపోయేలా చేస్తుందని మేకర్స్​ భావిస్తున్నారట.

    English summary
    The Bigg Boss Telugu Makers Changed The Nomination Process In 6th Season. And Contestants Have Hard Punishment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X