Bigg Boss elimination అఖిల్ బలి.. బిగ్‌బాస్ ఉచ్చులో ఆటగాళ్లు. కంటెస్టెంట్లతో నాటకం అలా
బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బిగ్‌బాస్ తెరలేపారనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. అర్ధరాత్రి సైరన్ మోగించి సూట్‌కేసులు సర్దుకొని లాన్‌లోకి రావాలని ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో అంతా సర్దుకొని బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ ప్రశ్న వేశాడు. ఫైనల్ వరకు మీ జర్నీలో ఎవరు మీకు అడ్డు పడుతారు అనే ప్రశ్నను ఇంటి సభ్యుల ముందు ఉంచారు. దాంతో వారి మధ్య ఏం జరిగిందంటే..

ఇంటి సభ్యుల చేతిలో ఎలిమినేషన్
ఇంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీసారి ఇంటి నుంచి కంటెస్టెంట్లను బయటకు పంపించడానికి ప్రజలకు అవకాశం ఇస్తారు. కానీ ఈ సారి మాత్రం మీకు ఇస్తున్నారు అంటూ బిగ్‌బాస్ ట్విస్టు ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యులు తలోమాట చెప్పుకొంటూ కనిపించారు.

నీవు గెలువడానికి.. నేను గెలవడానికే..
బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుపై సోహైల్ స్పందిస్తూ.. ఇంటిలోని ఓ వ్యక్తి ఫైనల్ వరకు వెళ్తాడనే ఫీలింగ్ అందరికి ఉంటుంది. నా మనసులో కూడా ఉంది అని అన్నారు. దాంతో నీవు గెలవడానికి వచ్చావు.. అలాగే నేను గెలవడానికి వచ్చాను. నేను గెలవడానికి వచ్చినప్పుడు నీ డ్రీమ్స్‌ను నేను చంపేయలేను కాదా? అంటూ సోహైల్‌కు హారిక సమాధానం ఇచ్చింది.

అవినాష్‌కు సోహైల్ కౌంటర్
ఇక బిగ్‌బాస్ ఇచ్చిన షాక్‌పై అవినాష్ స్పందిస్తూ.. నామినేషన్ ప్రక్రియలో కొన్ని కారణాలు చెప్పి.. ఇంటి నుంచి ఓ వ్యక్తిని బయటకు పంపడానికి ప్లాన్ చేస్తాం అని అన్నాడు. దానికి జవాబు ఇస్తూ.. అది కూడా తప్పు చేసినట్టే కాదా అంటూ సోహైల్ కౌంటర్ ఇచ్చారు. అయితే మనం నామినేట్ చేస్తాం కానీ.. ఎవరు వెళ్లాలనన్నది మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంది అంటూ హారిక వివరించే ప్రయత్నం చేసింది.

అరియానాకు షాకిచ్చిన అవినాష్
ఇంటి నుంచి బయటకు పంపించే విషయంపై స్పందిస్తూ.. అరియానా ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అవినాష్.. అలాగే మెహబూబ్ పేరును సోహైల్, అఖిల్ పేరును అరియానా చెప్పుకొంటు వచ్చారు. అయితే నాకు అడ్డు పడే వ్యక్తి ఎవరు నాకు కనిపించడం లేదు. నా గేమ్‌ను నేను ఆడుకోగలను అంటూ అఖిల్ సమాధానం ఇచ్చారు. అయితే బిగ్‌బాస్ ఒక పేరు చెప్పమన్నారు కాబట్టి.. అభిజిత్ అంటూ అభిజిత్ తన పేరు చెప్పుకోవడం గమనార్హం.

కత్తులు దూసుకొన్న కంటెస్టెంట్లు
తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ ఆడిన ఆటలో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని అఖిల్‌ను ఎక్కువ మంది నామినేట్ చేసినట్టు తెలిసింది. దాంతో ఇంటి నుంచి అఖిల్‌ను బయటకు పంపినట్టు సమాచారం. అలా బయటకు వెళ్లిన అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌కు తరలించినట్టు తెలుస్తున్నది. బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ విషయం స్పష్టం కానున్నది.


Click it and Unblock the Notifications











