Bigg Boss Telugu 6: ఇనయా ఈ మధ్య అతనివైపే.. అందరి ముందు గాలి తీసేసిన నాగార్జున
ప్రతి ఆదివారం కూడా నాగార్జున కంటెస్టెంట్స్ అందరిలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలిమినేషన్ తో పాటు సండే అంటే ఫన్ డే అంటూ అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఈ ఆదివారం కూడా ఆయన చాలా జోష్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే, ముందుగా రేవంత్ ఇంట్లో ఏదో ఎంటర్టైన్ చేస్తున్నావ్ అంట కదా అని ప్రశ్నించారు. ఇక రేవంత్ గీతూ బాస్ అంటూ చాలా ఫన్నీగా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు.

నా మీద సెటైర్లు వేస్తున్నారు
కావాలని నా మీద సెటైర్లు వేస్తున్నారు అని గీతూ కూడా సరదాగా చెప్పింది. ఇక నాగార్జున కూడా గీతూ నడిస్తే చాలా సరదాగా ఉంటుంది అని నవ్వించారు. అలాగే ప్రతీ ఇంట్లో గీతూ లాంటి అమ్మాయి ఉండేలాగా చేస్తాను అని ఆమె అనడంతో ఆడియన్స్ అందరూ కూడా వద్దు అని అనేస్తున్నారు. అలాగే ఇప్పుడు హౌస్ లో కూడా అదే ఫీలింగ్ అంటూ రేవంత్ కూడా పక్క నుంచి కౌంటర్ చేశాడు. ఇక ప్రత్యేకంగా నాగర్జున మ్యూజిక్ గేమ్ ఆడిస్తూ ఆ పాట ఏదో చెప్పాలి అని ఆట కూడా స్టార్ట్ చేశారు.

డైలాగ్స్ ట్యాగ్
శ్రీ సత్య కూడా ఆటలో తన పై చేయి సాధించే ప్రయత్నం చేసింది. ఇక రేవంత్ ఓ పాటను కనిపెట్టి డాన్స్ చేశాడు. ఇక డైలాగ్ ట్యాగ్స్ అందించిన నాగార్జున ఎవరికి ఆ డైలాగ్ డెడికేట్ చేస్తారో చెప్పాలి అని కూడా అన్నారు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.. అనే ఈ డైలాగ్ గీతు కి డెడికేట్ చేస్తున్నట్లు ఆదిత్య తెలియజేసాడు. ఇక నీ ఉద్దేశం ప్రకారం అదేనా అని చెప్పడంతో ఆదిత్య కూడా అదే అని అన్నాడు.

సొల్లు ఆపు దమ్ముంటే నన్ను ఆపు
సొల్లు ఆపు దమ్ముంటే నన్ను ఆపు.. అనే డైలాగ్ ఇనయా సూర్య మెడలో వేసింది. ఆడియోన్స్ కూడా ఒప్పుకున్నారు. ఈమధ్య ఇనయా ప్రొద్దుతిరుగుడు అయిపోయింది అనగానే, సూర్య ఎటు ఉంటే అటు వెళ్తోంది అని పక్కనే ఉన్న శ్రీహన్ కూడా నవ్వుతూ చెప్పాడు. అందుకు ఆడియన్స్ ని కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీక్ ఆడియన్స్ చేత నో చెప్పిస్తాను అని కూడా ఇనయా చాలెంజ్ చేసింది.

నా మాట నేనే వినను
ఇక ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ తో వచ్చిన అర్జున్ ను కమిట్ అయిపోయినని చెబుతున్నావా.. అని నాగార్జున ఆటపట్టించారు. తర్వాత వాసంతి 'చెయ్యి చూసావా ఇంత రఫ్ గా ఉందో' అనే డైలాగ్ తో వచ్చింది. ఇక ఆ డైలాగులు ఆమె రేవంత్ మెడలో వేసింది. పకోడా అని పిలుస్తాడు అని కంప్లైంట్ చేసింది. నేను కూడా కొడతాను నా చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో అని వాసంతి హెచ్చరించింది. మరి ఈ ఆదివారం ఇంకా ఎలాంటి సందడి ఉంటుందో పూర్తి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











