ఏరా అఖిల్ ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నవా.. పూజా హెగ్డేతో రొమాన్స్ పై నాగార్జున కౌంటర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రోజు చాలా ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ ను అందించింది. నాగార్జున బంగార్రాజు స్టైల్లో చాలా ట్రెడిషినల్ లుక్ తో కనిపించారు. అయితే ఆదివారం నాగ్ చెప్పినట్లుగానే ఫై మచ్ ఎంటర్టైన్మెంట్ ను అందించారు. కొంతమంది తారలు ప్రత్యేకమైన డాన్స్ లతో పాటు పాటలతో కూడా అలరించారు. ప్రత్యేకంగా గెస్ట్ లు కూడా వచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల సందర్భంగా అఖిల్ అక్కినేని హీరోయిన్ పూజా అయితే కూడా బిగ్ బాస్ స్టేజిపై స్పెషల్ అట్రాక్షన్గా దర్శనమిచ్చారు. అయితే వచ్చి రాగానే నాగార్జున అఖిల్ పై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

నాగార్జున సరికొత్త స్టైల్
నాగార్జున హోస్ట్ గా మారిన తర్వాత నాన్ స్టాప్ పంచ్ లతో కూడా ఎంతగానో అలరిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి యాంకర్స్ తరహాలోనే నాగార్జున కూడా స్పాట్ లోనే పదునైన డైలాగ్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హోస్ట్ గా ఆయన మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. మొదటి రెండు మూడు వారాలు కాస్త నార్మల్ గా కనిపించిన నాగార్జున ఈసారి మాత్రం తనలోని కొత్త అవతారాన్ని చూపిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

ఇది ఏమైనా నీళ్లు అనుకుంటున్నావా?
ఇక పూజా హెగ్డేను అఖిల్ ను కూడా షో లోకి పిలిచినా నాగార్జున వచ్చి రాగానే ఒక కామెంట్ కూడా చేశాడు. అఖిల్ పూజా స్టేజ్ పైకి రాగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని పాటకు ఎంతో నేచురల్ గా రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. వారిద్దరి అలా చూసిన నాగార్జున ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏరా అఖిల్ ఇది ఏమైనా నీళ్లు అనుకుంటున్నావా అంటూ డైరెక్ట్ గా మొహం మీద అడిగేశాడు.

తండ్రికి తగ్గ తనయుడిగా
ఇక తండ్రికి తగ్గ తనయుడిగా అఖిల్ తనదైన శైలిలో సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక స్టేజ్ మీదే అని మీరే అన్నారు కదా అందుకే ఈ విధంగా చేసినట్లు ఆన్సర్ ఇవ్వడంతో అందుకు నాగ్ షాకయ్యాడు. నేను స్టేజ్ మీదే అని చెప్పలేదు.. నాతో పాటు రమ్మని చెప్పాను, అని అనడంతో ఒక్కసారిగా పూజ కూడా నవ్వేసింది. ఇక అందరూ సరదాగా నవ్వుకుంటూ కౌగిలించుకున్నారు.

బ్యాచిలర్స్ కు పూజను ఇంప్రెస్ చేసే ఛాన్స్
ఇక హౌస్ మెంట్స్ ను కూడా ఒక్కొక్కరిని పరిచయం చేయించిన నాగార్జున పూజ హెగ్డేని హౌస్ లో ఉన్న ఎవరైనా సరే ఇంప్రెస్ చేయవచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఇక ముందుగా సింగర్ శ్రీరామచంద్ర ఎప్పటిలానే సామజవరగమన పాటతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అందులో కొత్తగా ఏమీ ఉంది.. మీకు రానిది ఏదైనా డాన్స్ చేయాలని పూజా చెప్పడంతో మీరు ఉంటే ఇంకా బాగా చేస్తాను అని రామచంద్ర సమాధానమిచ్చాడు.
Recommended Video

ఆఖరికి అఖిల్ కు ఇంప్రెస్ అయ్యాను అంటూ..
ఇక ఆ తర్వాత సన్నీ బాతు లాగ శబ్దం చేస్తూ ఐ లవ్ యూ చెప్పడంతో పూజా హెగ్డే వెంటనే కనిపెట్టేసింది. ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ సింగిల్ కింగులం అని స్కిట్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత మోడల్ జెస్సి తన వాకింగ్ స్టైల్ తో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక మానస్ తన డాన్స్ టాలెంట్ ను బయటపెట్టి బుట్టబొమ్మను ఆకట్టుకోవాలని అనుకున్నాడు. అందరూ ప్రయత్నాలు చేసిన తర్వాత ఎవరికి ఇంప్రెస్ కాలేదని చెప్పిన పూజా.. రెండు నిమిషాల్లో మీకు ఎలా పడతాను? రెండున్నర గంటల పాటు సినిమాల్లో ఇంప్రెస్స్ చేయడానికి అఖిల్ ప్రయత్నం చేశాడు అని అందుకే నేను అతనికి పడిపోయాను అంటూ కౌంటర్ ఇచ్చేసింది.


Click it and Unblock the Notifications











