Bigg Boss Telugu 6: మధ్యలో వెళ్లిపోతే.. అలాంటి వారికి షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఐదు సీజన్లకు ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు నాగార్జున హోస్ట్ మొదలు కాబోయే 6వ సీజన్ కోసం ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రియాల్టీ షోకు సంబంధించిన ఒక టీజర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు వలన మీరు రియాలిటీ షోకు కొంత మైనస్ అయ్యింది అని ఈసారి కంటెస్టెంట్స్ కు కొన్ని ప్రత్యేకమైన నియమనిబంధనలను పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఒక కండిషన్ ద్వారా షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకాస్త ఎక్కువ స్థాయిలో

ఇంకాస్త ఎక్కువ స్థాయిలో

చాలావరకు బిగ్ బాస్ లో పాల్గొంటే కంటెంట్స్ చాలా ఓపికతో పాల్గొనాల్సి ఉంటుంది. ఏమాత్రం ఓర్పు సహనం కోల్పోయిన కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈసారి కౌన్సిలింగ్ ఇచ్చి స్థిరంగా బలంగా ఉండే వారిని ఎక్కువగా షోలోకి తీసుకు వస్తున్నారట. ప్రతీసారి కౌన్సిలింగ్ కామన్ అయినా ఈసారి ఇంకాస్త ఎక్కువ స్థాయిలో టెస్ట్ చేస్తున్నట్లు టాక్. ఇక బిగ్ బాస్ 6 సీజన్ కోసం దాదాపు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం.

ఒక ఇద్దరు

ఒక ఇద్దరు

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ఈసారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అందులో టెలివిజన్ సెలబ్రిటీలతో పాటు కొంతమంది కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఆ క్యాటగిరీలో ఇద్దరిని రప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సరికొత్త టాస్క్

సరికొత్త టాస్క్

ముఖ్యంగా ఆరవ సీజన్లో టాస్కుల విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ లేకుండా సరికొత్త టాస్క్ సృష్టించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కంటెస్టెంట్స్ ప్రతివారం కూడా ఒక స్పెషల్ టాస్క్ ను ఎదుర్కోవాల్సి ఉండేలా ఏర్పాటులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మధ్యలో వెళ్లిపోతే

మధ్యలో వెళ్లిపోతే

అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోతూ ఉంటారు. ఒక విధంగా బిగ్ బాస్ షోలో అలా జరగడం నిబంధనలకు విరుద్ధమని చెప్పాలి. కానీ కంటెంట్స్ ఆరోగ్య సమస్యల వలన ఏదైనా ఎమర్జెన్సీ కారణాల వలన వెళ్ళిపోయే పరిస్థితిలు ఏర్పడితే మాత్రం బిగ్ బాస్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఎలిమినేట్ అయ్యేవరకు ఉండే విధంగానే బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి బలమైన అగ్రిమెంట్ కంటెస్టెంట్స్ ను తీసుకురాబోతున్నారు.

ఆ ప్రాబ్లం రాకుండా..

ఆ ప్రాబ్లం రాకుండా..

ఏవైనా ఆరోగ్య సమస్యలు కుటుంబ పరిస్థితులు వలన మధ్యలో వెళ్ళిపోయా అవకాశం ఉంటే మాత్రం ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ విధంగా ఏదైనా మధ్యలో వెళ్లాల్సి వచ్చే విషయాన్ని దాచిపెట్టినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎలాంటి విషయాలను దాచకూడదు. గతంలో గంగవ్వ, నోయిల్ విషయంలో అది మినహాయించారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఈసారి అగ్రిమెంట్లో ప్రత్యేకంగా నోట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మధ్యలో వెళ్లి పోవాల్సి వస్తే మొత్తం పేమెంట్ మొత్తం ఇవ్వకుండా అందులో కొంత కోత కూడా విధించే ఛాన్స్ ఉందట. దాన్నిబట్టి కంటెస్టెంట్స్ జాగ్రత్తగా బిగ్ బాస్ లో చాలా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది. మరి ఈసారి ఎవరైనా మధ్యలో వెళ్లిపోతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X