Bigg Boss Telugu OTT లేటెస్ట్ లిస్టు.. ఆ విషయంలో ట్విస్ట్.. షో ఎప్పుడంటే?

బిగ్ బాస్, ఎక్కడో వేరే దేశంలో బిగ్ బ్రదర్ గా మొదలైన ఈ షో ఇప్పుడు భారత్ వ్యాప్తంగా హవా చూపిస్తూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా తెలుగులోభారీ స్పందన అందుకుంటూ భారీ టీఆర్పీ కూడా రాబడుతోంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్రమంలో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయంతో పాటు కొందరు కంటెస్టెంట్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఐదేళ్లుగా సందడి

ఐదేళ్లుగా సందడి


2017లో మొదలైన తెలుగు బిగ్ బాస్ షో దాదాపు ఐదేళ్లుగా సందడి చేస్తోంది. మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను హీరో నాని హోస్ట్ చేయగా మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా మొత్తం మీద ఈ షో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే ఐదింటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు సీజన్లలో మగ కంటెస్టెంట్లు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.

 ఓటీటీ వెర్షన్‌

ఓటీటీ వెర్షన్‌


బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌ కొద్ది రోజుల క్రితమే ముగియగా ఆ ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుంది అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున దీని గురించి మాట్లాడి అంచనాలు పెంచేశాడు. గత ఏడాదే బిగ్ బాస్‌తో పాటు ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైన విషయం తెలిసిందే.

 మరింత వేగవంతం

మరింత వేగవంతం


ఇక హిందీ బాటలోనే తెలుగులో కూడా దీన్ని మొదలు పెట్టతున్నారు. దీనికి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇది హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం కాబోతుందని వార్తలు వెలువదుతున్నాయి. త్వరలో మొదలు కానున్న ఈ షోకి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. అంతేకాదు, ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేశారని తెలుస్తోంది.

ఎవరెవరు అంటే

ఎవరెవరు అంటే

అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. చాలా మంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదర్శ్, తనీష్, అఖిల్ సార్థక్, అలీ రెజా, హరితేజ, సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ మౌనికా రెడ్డి, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, వంటి వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి.

 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

ఇక ఈ ఓటీటీ సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనలు, ప్రోమోలు కూడా త్వరలో సిద్ధం చేస్తారని అంటున్నారు. ఇక బిగ్ బాస్ ఓటీటీ 82 రోజుల పాటు రోజుకు 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. గ‌తంలో షో రోజుకు 1 గంట నుంచి 2 గంట‌ల మేర మాత్ర‌మే ప్ర‌సారం అయ్యేది. కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుందని అంటున్నారు.

Recommended Video

Venkat Speech | Loser Season 2 Pressmeet | Zee 5 Originals | Filmibeat Telugu
హిందీలా కాకుండా

హిందీలా కాకుండా

అయితే హిందీ మాదిరిగా ఈ సీజన్ లో మొదటి మూడు నాలుగు ప్లేస్ లలో నిలిచిన వారిని తరువాతి సీజన్ కు ప్రమోట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత సీజనల నుంచి కంటెస్టంట్ లను ఈ ఒటీటీ వర్షన్ లోకి తీసుకోవడంతో వారిని తరువాతి సీజన్ 6 కి తీసుకోవడం ఇబ్బందే అని అంటున్నారు. సో హిందీ వర్షన్ ను ఇక్కడ బ్రేక్ చేయబోతున్నారు అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X