బిగ్ బాస్ ఓటీటీ వివరాలు లీక్: మొదలయ్యేది ఆ డేట్ నుంచే.. ఎవరూ ఊహించనంత మంది కంటెస్టెంట్లు
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లుగా సందడి చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఏ భాషలోనూ దక్కనంత స్పందనను అందుకుంటూ భారీ టీఆర్పీని రాబడుతోంది. ఫలితంగా ఇది తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Recommended Video
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుందన్న విషయంతో పాటు మొత్తం కంటెస్టెంట్ల వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

తెలుగు షోకు జాతీయ స్థాయి పేరు
తెలుగులోకి అంచనాలు లేకుండానే వచ్చి.. ఊహించని రీతిలో ఆదరణను అందుకుంటూ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న షో బిగ్ బాస్. టీఆర్పీలో నెంబర్ వన్‌గా నిలుస్తోన్న మన షో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఐదింటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు సీజన్లలోనూ మగ కంటెస్టెంట్లే విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.

మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ కొద్ది రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున దీని గురించి మాట్లాడి అంచనాలు పెంచేశాడు.

ఓటీటీ వెర్షన్... రోజంతా ప్రసారమే
గత ఏడాదే బిగ్ బాస్‌తో పాటు ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైన విషయం తెలిసిందే. హిందీలో ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా దీన్ని మొదలెట్టబోతున్నారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఇది హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం కాబోతుంది.

కంటెస్టెంట్ల ఎంపిక మరింత వేగం
బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ షోను అభిమానించే వాళ్లందరూ ఇప్పుడు ఓటీటీ వెర్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. దీనికంటే ముందు ఇందులో ఎవరు పాల్గొనబోతున్నారన్న దానిపై చర్చించుకుంటున్నారు. అయితే, ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఎప్పుడో మొదలైంది. అంతేకాదు, ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేశారని తెలుస్తోంది.

కంటెస్టెంట్లలో వాళ్లకూ అవకాశం
అతి త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఊహించని పరిణామాలను చూపించబోతున్నారట. మరీ ముఖ్యంగా ఇందులో ముగ్గురు మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎప్పటి నుంచి మొదలవుతుంది
తెలుగు బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓటీటీ వెర్షన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కాబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటనలు, ప్రోమోలు జనవరి చివరి వారం నుంచి వదలబోతున్నారట. ఇందుకోసం సెట్ వర్క్ కూడా వేగంగా జరుగుతుందట.

ఊహించనంత మందితో స్టార్టింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్లలో ప్రతిసారీ పరిమితి లేకుండా కంటెస్టెంట్లను దింపుతూ వచ్చారు. ఐదో సీజన్‌లోనైతే ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. ఇక, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం మాత్రం ఊహించని విధంగా 14 మందినే తీసుకు వస్తున్నారట. వీళ్లతో పాటు కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయని తెలిసింది. వాళ్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











