Bigg Boss Telugu OTT: మొదటి కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది.. ఓటీటీలో మొదలయ్యేది ఎప్పుడంటే?

టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవుతుందని మొదట ఎవరు ఉహించలేదు. మొదట ఈ షో స్టార్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇలాంటి షోలు ఏ మాత్రం సక్సెస్ కావు అని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం మొదటి సీజన్ నుంచి ఐదవ సీజన్ వరకు మంచి రేటింగ్స్ తో మరింత ముందుకు వెళ్లేందుకు దారులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

త్వరలోనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓటీటీ వెర్షన్ లో ఎలాంటి సెలబ్రిటీలు పాల్గొంటారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఒక యూ ట్యూబ్ యాంకర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

విజయవంతంగా 5వ సీజన్

విజయవంతంగా 5వ సీజన్

బిగ్ బాస్ తెలుగు లో మొత్తానికి భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. నాగార్జున హోస్టింగ్ తో ఐదవ సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది గత సీజన్ లో కంటే ఈ సారి క్రేజ్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తానికి నాగార్జున పర్వాలేదు అనే విధంగా మెప్పించాడు. బిగ్ బాస్ 5 వ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు.

హిందీలో సక్సెస్..

హిందీలో సక్సెస్..

అయితే మరో రెండు నెలల తర్వాత బిగ్ బాస్ మళ్ళీ మొదలవుతుంది అని నాగార్జున ఫైనల్ డే రోజు క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఇక ఎప్పుడు ఎలా మొదలవుతుందో అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఓటీటీ ద్వారా బిగ్ బాద్ ను కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీలో కరణ్ జోహార్ హోస్టింగ్ తో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్టార్ట్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అందుకే తెలుగులో కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్.. ఆహాలో బిగ్ బాస్

నెట్ ఫ్లిక్స్.. ఆహాలో బిగ్ బాస్

త్వరలోనే మరొక యువ హీరోతో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం టెలికాస్ట్ హక్కులను అందుకునేందుకు పోటీ పడ్డట్లు సమాచారం. ఇక ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ అహ పోటీ పడి లో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రసారం కాబోతునట్లు సమాచారం.

యాంకర్ శివ గ్రీన్ సిగ్నల్..

యాంకర్ శివ గ్రీన్ సిగ్నల్..

ఇక ఓటీటీ వెర్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో ఒక యూట్యూబ్ యాంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యాంకర్ శివ అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో అతను కాంట్రవర్సీ విషయాలపై సోషల్ మీడియాలో కూడా రెస్పాన్డ్ అవుతున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Reasons Behind RJ Kajal Elimination | Filmibeat Telugu
మరింత డిఫరెంట్ గా..

మరింత డిఫరెంట్ గా..

యాంకర్ శివను మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఇక ఒక యువ హీరో హోస్టింగ్ తో మొదటి వెర్షన్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం ఇప్పటికీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టీవీలో ప్రసారమయ్యే షోకు అలాగే ఓటీటీ వెర్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఈ షోను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X