Bigg Boss Telugu OTT: నెవర్ బిఫోర్ అనేలా యువ హీరోతో ప్లానింగ్.. ఎన్ని రోజులు ఉంటుందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి రేటింగ్స్ అందుకోవడంలో మరోసారి రికార్డులు క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగో సీజన్ తో పాటు ఐదవ సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగార్జున తదుపరి సీజన్ ను ఎలా స్టార్ట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందే మరో హీరో ద్వారా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మొదట్లో నెగిటివ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు లో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదట్లో చాలానే వచ్చాయి. ఇలాంటి కాంట్రవర్సీ షో కేవలం నార్త్ ఇండియా లోనే సక్సెస్ అవుతుంది అని అంతేకాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో హోస్ట్ గా ఎవరు చేయలేరు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా నిర్వాహకులు గ్రాండ్ గా మొదలుపెట్టే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన నాగార్జున
అయితే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నాని కేవలం ఒక్క సీజన్ తోనే ఆకట్టుకున్నాడు. ఇక నాగార్జున వచ్చిన తర్వాత ఈ షో కు భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. రేటింగ్స్ కూడా రోజురోజుకు మరింతగా పెరుగుతూ ఉండడంతో షో నిర్వాహకులు భవిష్యత్తులో కూడా మరింత కొత్తగా బిగ్ బాస్ షోను ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున మరో రెండు నెలల్లో కొత్త తరహాలో మీ ముందుకు రాబోతున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీ బిగ్ బాస్..
అయితే ఈసారి టెలివిజన్ లో కాకుండా కేవలం ఓటీటీ లో మాత్రమే బిగ్ బాస్ ను ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. అది రెగ్యులర్ బిగ్ బాస్ షో కంటే కొంత భిన్నంగా ఉంటుంద ని తెలుస్తోంది. అంతేకాకుండా ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఉంటుందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీకి మంచి క్రేజ్ దక్కింది.

కంటెస్టెంట్స్ కూడా రెడీ..
సౌత్ ఇండస్ట్రీ లో కూడా ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టాలి అని నిర్వాహకులు ఆలోచిస్తున్నార. హాట్ స్టార్ లో ప్రత్యేకంగా మొదలు పెట్టేందుకు ప్రస్తుతం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టేందుకు పేర్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video

యువ హీరోతో..
టీవీలో వచ్చే బిగ్ బాస్ షోకు అలాగే ఓటీటీ లో వచ్చే బిగ్ బాస్ షోకు చాలా తేడా ఉంటుందట. అయితే అది కేవలం 56 మాత్రమే ఉంటుందని కూడా ప్రస్తుతం ఒక టాక్ వినిపిస్తోంది. నాగార్జున కాకుండా ఒక యువ హీరో హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వాహకులు సెలబ్రిటీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్కసారి మొత్తం ప్లాన్ సిద్ధమైతే ఫిబ్రవరి నెలలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ తరహా బిగ్ బాస్ షోను జనాలు ఎంతవరకూ ఆదరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











