Bigg Boss Telugu OTT: ఫిక్స్ అయిన టాప్ 4 కంటెస్టెంట్స్.. మొదలయ్యేది ఎప్పుడంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో అసలు బిగ్ బాస్ అలాంటి కాంట్రవర్షియల్ షో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదలట చాలానే వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ రియాలిటీ షో 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ కొత్త తరహాలో ఓటీటీ వెర్షన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇక తెలుగు ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నిర్వాహకులు ఇంట్రెస్టింగ్ గా అనిపోయించే కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారట. కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ అలాగే పలువురు టీవీ సెలబ్రిటీలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరోసారి హోస్ట్ బాధ్యతలు

మరోసారి హోస్ట్ బాధ్యతలు

బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జున 6వ సీజన్ ను ఏ రోజు మొదలు పెడతారు అనే విషయంలో అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. అయితే అంతకంటే ముందే ఫిబ్రవరి నెలలో నాగార్జున ఓటీటీ ద్వారా సరికొత్త బిగ్ బాస్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దానికి కూడా తానే హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు.

మామూలుగా ఉండదట

మామూలుగా ఉండదట

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదలు కాబోతోంది. ఒక విధంగా టెలివిజన్ లో ప్రసారమయ్యే రెగ్యులర్ బిగ్ బాస్ షో కంటే కూడా ఓటీటీ కంటెంట్ కాస్త విభిన్నంగా ఉంటుందట. కంటెంట్ డోస్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. డిజిటల్ మార్కెట్ కాబట్టి కాస్త గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

యూట్యూబ్ యాంకర్ శివ

యూట్యూబ్ యాంకర్ శివ

ఓటీటీలో వచ్చే మొదటి సీజన్ కాబట్టి కాబట్టి ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి నిర్వాహకులు మంచి పేరున్న సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా తీసుకు వచ్చే అవకాశం ఉందట. తెలుగు సినిమా సెలబ్రెటీలను మాత్రమే కాకుండా యాంకర్స్ ను అలాగే యూట్యూబ్ లో పాపులర్ అయిన చిన్నతరహా సెలబ్రిటీలను కూడా బిగ్ బాస్ లోకి తీసుకు వచ్చే అవకాశం ఉందట. ముందుగా యూట్యూబ్ లో మంచి యాంకర్ గా గుర్తింపు అందుకుంటున్న శివ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అతని మొదటి కంటెస్టెంట్ అని కూడా చెబుతున్నారు.

 మరో టీవీ 9 యాంకర్

మరో టీవీ 9 యాంకర్

ఇక తెలుగు న్యూస్ మీడియాలో మంచి న్యూస్ రీడర్ గా గుర్తింపు అందుకున్న మరొక యాంకర్ గా కూడా రాబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు. టీవీ 9 న్యూస్ రీడర్ యాంకర్ ప్రత్యూష అని తెలుస్తోంది. గతంలోనే ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

బ్యూటీఫుల్ గర్ల్.. వైష్ణవి చైతన్య

బ్యూటీఫుల్ గర్ల్.. వైష్ణవి చైతన్య

ఇక షణ్ముఖ్ జస్వంత్ తో పాటు 'సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్' అనే వెబ్ సీరీస్ తో బాగా క్రేజ్ అందకుండా వైష్ణవి చైతన్య కూడా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అల..వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ సోదరి గా నటించిన విషయం తెలిసిందే

Recommended Video

Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
డీ 10 రాజు కూడా..

డీ 10 రాజు కూడా..

అలాగే డి 10 టైటిల్ విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ద్వారా తన క్రేజ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును అందుకున్న డీ రాజు మొన్నటి వరకు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరు టెలివిజన్ సెలబ్రిటీలు కూడా కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X