twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu OTT ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.. హోస్ట్ నాగార్జున అక్కినేని క్లారిటీ

    |

    బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లపై హీరో నాగార్జున అక్కినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై కొందరు ప్రతికూలంగా స్పందించగా, మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే నాగార్జున వేసుకొన్న లెక్కలు మాత్రం కరెక్టే అనే విషయం రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లు నిరూపించాయి. ఈ వ్యవహారంపై నాగార్జున మాట్లాడుతూ..

    బంగార్రాజు హిట్ గురించి

    బంగార్రాజు హిట్ గురించి


    బంగర్రాజు సినిమా హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయం మాకు తెలుసు. ఆ మొత్తం కలెక్ట్ చేస్తే మనకు వర్కవుట్ అవుతుందా? లేదా అనేది చూసుకొన్నాం. అదే విధంగా బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పం.. తక్కువ చేసి చెప్పం. సినిమాకు ఎంత వస్తే హిట్ అవుతుందనే లెక్క మా వద్ద ఉంటుంది. దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం. అందుకే ఏపీలో సినిమా రిలీజ్ చేస్తే మాకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పాను అని నాగార్జున అన్నారు.

    రెండేళ్లు పనిలేకుండా ఇంట్లోనే

    రెండేళ్లు పనిలేకుండా ఇంట్లోనే

    మాకు ఉన్న లెక్కల ఆధారంగా బంగార్రాజు సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. ఒకవేళ రేట్లు పెరిగి.. అక్యుపెన్సీ పెరిగితే మాకు వచ్చే వసూళ్లు బోనస్. సినిమా ఆడకపోతే ఏం చేయలేం. సినిమా బాగుందని టాక్ వస్తే.. మేము సేఫ్ అని నిర్ణయానికి వచ్చాం. ఇప్పటికే రెండేళ్లు ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో ఉండి ఏమీ చేయక రెండేళ్లు అలా గడిచిపోయాయి. ఇక ఇలా కూర్చొంటే కుదరదనే మొండి ధైర్యంతో సినిమాను రిలీజ్ చేశాం అని నాగార్జున పేర్కొన్నారు

    బిగ్‌బాస్ కారణంగా రిలాక్స్

    బిగ్‌బాస్ కారణంగా రిలాక్స్

    దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఇంట్లోనే ఉంది. కానీ నాకు మాత్రం బిగ్‌బాస్ తెలుగు 5 కారణంగా పని దొరికింది. బిగ్‌బాస్ కోసం బయటకు వచ్చి నేను పనిచేసి కాస్త రిలాక్స్ అయ్యాను. లేకపోతే నాకు చాలా ఇబ్బందికరమైన లైఫ్‌ను ఇంట్లోనే అనుభవించాల్సి వచ్చేది. బిగ్‌బాస్‌ కారణంగా పనితోపాటు రిలాక్స్ అయ్యాను అని నాగార్జున తెలిపారు.

    ఫిబ్రవరి మూడో వారంలో బిగ్‌బాస్ ఓటీటీ

    ఫిబ్రవరి మూడో వారంలో బిగ్‌బాస్ ఓటీటీ

    బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ గురించి ఫిల్మీబీట్ తెలుగు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 3వ వారంలో షో ప్రారంభం అవుతుంది. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల కోసం సెలక్షన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీకి సంబంధించిన డేట్ ఫిక్స్ అవుతుంది అని చెప్పారు. త్వరలోనే అధికారికంగా డేట్ ప్రకటించేందుకు ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని నాగార్జున చెప్పారు.

    24 గంటలపాటు బిగ్‌బాస్ షో ప్రసారం..

    24 గంటలపాటు బిగ్‌బాస్ షో ప్రసారం..


    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటికే 5 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఆరో సీజన్‌కు కూడా రంగం సిద్దం చేస్తున్నది. బిగ్‌బాస్ తెలుగు 6 ప్రారంభానికి ముందు హిందీలో ఇటీవల పరిచయం చేసిన బిగ్‌బాస్ ఓటీటీ షోను తెలుగులో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. బిగ్‌బాస్ ఓటీటీ తెలుగుకు సంబంధించిన ప్రసారం 24 గంటలపాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

    English summary
    Bigg Boss Telugu OTT show to hit on Telugu Televison Industry. As part of Bangarraju promotions, Nagarjuna Akkineni has given clarity on Bigg Boss OTT show start on february.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X