Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ తెలుగు సీజన్.. కొత్త డేట్ ఇదే

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ షోలు మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాయి. తద్వారా సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఈ షో దాదాపు ఐదేళ్లుగా సందడి చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఇది తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ వాయిదా పడినట్లు తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మన షోకు జాతీయ స్థాయి గుర్తింపు

మన షోకు జాతీయ స్థాయి గుర్తింపు

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చి.. ఊహించని రీతిలో ఆదరణను అందుకుంటూ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న షో బిగ్ బాస్. టీఆర్పీలో నెంబర్ వన్‌గా నిలుస్తోన్న మన షో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే ఐదింటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇక, వీటన్నింటిలోనూ మేల్ కంటెస్టెంట్లే విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.

24 గంటలు హాట్‌స్టార్‌లో ప్రసారం

24 గంటలు హాట్‌స్టార్‌లో ప్రసారం

2021లో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను హిందీ నిర్వహకులు మొదలుపెట్టారు. అక్కడ ఇది భారీ స్పందనతో సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకుని వస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో చూపించరు. కేవలం ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఓటీటీ సీజన్ ఎక్కడి వరకొచ్చింది?

ఓటీటీ సీజన్ ఎక్కడి వరకొచ్చింది?

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలు కానుంది. దీంతో చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన అన్ని పనులనూ మొదలెట్టారు. సెట్ వర్క్‌ను దాదాపుగా కంప్లీట్ చేసేశారని తెలుస్తోంది. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారని టాక్. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు తెలిసింది.

డేట్, కంటెస్టెంట్లు, రోజుల వివరాలు

డేట్, కంటెస్టెంట్లు, రోజుల వివరాలు

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎంతో వైభవంగా మొదలు అవుతుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ ప్రియులకు షాకిచ్చే వార్త

బిగ్ బాస్ ప్రియులకు షాకిచ్చే వార్త

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోను అభిమానించే వాళ్లు కొన్ని లక్షల మందే ఉన్నారు. అందుకే ఇక్కడ ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు, త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఓటీటీ వెర్షన్ కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వాయిదా పడిందన్న న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.

అప్పటికి వాయిదా పడ్డ కొత్త సీజన్

అప్పటికి వాయిదా పడ్డ కొత్త సీజన్

బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభం కావడం లేదట. దీన్ని ఒక ఆరు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 26 నుంచి అంగరంగ వైభవంగా మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. ఇక, ఈ సీజన్ ఆదివారం కాకుండా శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగులో ఇలా జరగడం ఇదే తొలిసారి.

Recommended Video

Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
వాయిదాకు అసలు కారణం ఇదే

వాయిదాకు అసలు కారణం ఇదే

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి చివరి వారానికి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఇది మరింత ఆలస్యం అవడానికి కారణం సెట్ వర్క్‌తో పాటు కొన్ని టెక్నికల్ పనులు పూర్తి కాకపోవడమేనని తెలుస్తోంది. అంతేకాదు, కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ కొంత అయోమయం నెలకొందట. అందుకే మరో వారం రోజులు సమయం తీసుకుంటున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X