Bigg Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 డేట్ కన్ఫార్మ్.. ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాకుతోందీ రియాల్టీ షో. అందరినీ తెగ అలరిస్తూ.. రచ్చ లేపుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ.. అన్ని భాషల్లో సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాధించుకుని.. సీజన్ల మీద సీజన్లు చేస్తోంది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఓటీటీ వేధికగా రెండో సీజన్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తి కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి సీజన్ లో రచ్చ సాగింది. విపరీతమైన టీఆర్పీ కూడా వచ్చింది. ఇదే ఊపులో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటీటీ సీజన్ 2 ను ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ 2 ను ఫిబ్రవరి నెల నుంచే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈక్రమంలోనే ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు తీసుకు రావాల్సిన కంటెస్టెంట్లను ఫైనల్ చేసుకునే పనిలో పడ్డారట. అంతే కాకుండా ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లను ఫైనల్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ కంటెస్టెంట్లు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న పాట బిడ్డ భోలె షవాళి ఈసారి ఓటీటీ సీజన్ కు కూడా రాబోతున్నారని టాక్ నడుస్తోంది. ఎంతో టాలెంట్ ఉండి.. చక్కగా గేమ్ ఆడిన ఆయన సీజన్ 7లో సడెన్ గా ఎలిమినేట్ అయ్యారని.. దాన్ని కంటెస్టెంట్లే జీర్ణించుకోలేకపోతున్నారని చర్చ సాగిందట. ఈక్రమంలోనే ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని ఓటీటీ సీజన్ 2 కు తీసుకుంటున్నారట. మరి ఇప్పుడైనా పాటబిడ్డ చక్కగా గేమ్ ఆడి చివరి వరకు ఉంటాడా లేక మధ్యలోనే వెళ్లిపోతున్నాడా అనేది చూడాలి. వీళ్లే కాకుండా మరో ఐదుగురు కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం.

తెలగులో ఓ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రిచా పనయ్ ను బిగ్ బాస్ ఓటీటీకి తీసుకు రాబోతున్నారట. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషను కూడా తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఆమె వద్దకు వెళ్లగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వీరితో పాటు నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ యశ్, సింగర్ పార్వతిలను తీసుకు వస్తున్నారట. ఇప్పటికే ఈ ఆరుగురు కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి వీరంతా వస్తారా లేక కొత్త వారెవరైనా కనిపిస్తారా అనేది.


Click it and Unblock the Notifications











