Bigg Boss OTT: మరో ఊహించని కంటెస్టెంట్ పేరు లీక్.. ఆ సీజన్ రన్నర్‌కు బంపర్ ఆఫర్
తెలుగు బుల్లితెరపై అప్పటి వరకూ ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. గతంలో దేనికీ దక్కనంత రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా మన దగ్గరే కాదు.. దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకున్న షోగా నిలిచింది. దీంతో సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ పేరు ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

బిగ్ బాస్ షో.. ఐదు సీజన్లు కంప్లీట్
దాదాపు పదిహేనేళ్ల క్రితమే బిగ్ బాస్ షో హిందీలో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇండియాలోని చాలా భాషల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఐదు సంవత్సరాల క్రితమే తెలుగులోకి సైతం పరిచయం అయింది. మన దగ్గర మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంది. ఫలితంగా ఇప్పటికే ఐదు సీజన్లను అత్యధిక రేటింగ్‌తో పూర్తి చేసుకుని నెంబర్ వన్ షోగా నిలిచింది.

ఇప్పుడు మరో ప్రయోగంతో సిద్ధం
బిగ్ బాస్ ఐదో సీజన్ గత నెలలోనే ముగిసింది. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు త్వరలోనే ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత దానికి హోస్టుగా అక్కినేని నాగార్జునే ఉంటాడని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని మాట్లాడిన నిర్వహకులు ఓటీటీ వెర్షన్‌పై అంచనాలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.

24గంటలు ప్రసారం.. అందులోనే
ఇప్పటికే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ హిందీలో ప్రసారం అయింది. అక్కడ దీనికి వీక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తెలుగులోనే కూడా మొదలెట్టబోతున్నారు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేస్తున్నట్లు ముందే చెప్పారు.

బిగ్ బాస్ ఓటీటీ పనులు ప్రోగ్రెస్
త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఎప్పుడో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో పాల్గనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయింది. అంతేకాదు, షార్ట్ లిస్టును కూడా రెడీ చేశారట. అదే సమయంలో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోందట. చాలా మార్పులతో హౌస్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఓటీటీ పూర్తి వివరాలివే
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇది 82 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో మాజీ కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. బిగ్ బాస్‌లా కాకుండా కొంత కొత్తగా ఉంటుందని టాక్.

మరో మాజీ కంటెస్టెంట్ పేరు లీక్
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరినట్లు ఇప్పటికే చెప్పుకున్నాం. ఇందులో సినిమా, సీరియల్ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లతో పాటు సోషల్ మీడియా స్టార్లను దింపబోతున్నారట. దీని కోసం ఇప్పటికే నిర్వహకులు చాలా మందితో చర్చలు జరిపారట. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణను ఎంపిక చేశారట.

ఆ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు
సినీ నటుడిగా తెలుగు వాళ్లకు సుపరిచితుడు అయిన అదర్శ్ బాలకృష్ణ.. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఏమాత్రం అంచనాలు లేకుండానే ఫినాలేకు చేరుకున్నాడు. కానీ, చివర్లో శివ బాలాజీ విన్నర్ అవడంతో అతడు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఛాన్స్ ఇచ్చారని తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











