Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్‌కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీలోకి మాజీ కంటెస్టెంట్.. అప్పటి ఫైనలిస్టుకు బంపర్ ఆఫర్
తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ.. సరికొత్త కాన్సెప్టుతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. గతంలో దేనికీ దక్కనంత రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఇది.. దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను అందుకుంటోంది. అందుకే అన్ని భాషల కంటే తెలుగులో వచ్చే షో మాత్రమే నెంబర్ వన్‌గా నిలుస్తోంది. ఇక, ఇటీవలే ఐదో సీజన్‌ను పూర్తి చేసుకున్న షో నిర్వహకులు.. ఇప్పుడు మరో ప్రయోగంతో రాబోతున్నారు. అదే బిగ్ బాస్ ఓటీటీ. త్వరలోనే దీనికి సంబంధించిన మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

సూపర్ హిట్.. ఐదు సీజన్లు పూర్తి
'బిగ్
బ్రదర్'
అనే
ఇంగ్లీష్
రియాలిటీ
షో
ఆధారంగా
హిందీలో
'బిగ్
బాస్'
ప్రారంభం
అయింది.
ఆ
తర్వాత
దేశంలోని
చాలా
భాషల్లో
ఇది
మొదలైంది.
అలా
తెలుగులోకి
కూడా
పరిచయం
అయింది.
సాదాసీదా
వచ్చినప్పటికీ..
తక్కువ
టైమ్‌లోనే
ప్రేక్షకుల
హృదయాలను
దోచుకున్న
ఈ
షో
ఒకటి
కాదు..
రెండు
కాదు..
ఏకంగా
ఐదు
సీజన్లను
సక్సెస్‌ఫుల్‌గా
పూర్తి
చేసేసుకుంది.
అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

హిందీలో మాదిరిగా ఇక్కడ రెడీ
తెలుగులో బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రెండు వారాల క్రితమే ముగిసింది. ఈ వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున దీని గురించి మాట్లాడి హుషారు పెంచేశారు.

ఓటీటీ వెర్షన్ రెడీ చేస్తోన్న టీమ్
హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా దీన్ని పరిచయం చేయబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంది. దీన్ని కూడా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.
హైపర్ ఆది పెళ్లిపై నోరు జారిన తండ్రి: అమ్మాయిని చూసేశాం కానీ.. విష్ణుప్రియను లాగుతూ సంచలన వ్యాఖ్యలు

అందులోనే ప్రసారం.. రోజంతా
బిగ్ బాస్ షో మాదిరిగా ఓటీటీ వెర్షన్ టీవీ ఛానెల్‌లో ప్రసారం కాదు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, 24 గంటలూ ఇది ప్రసారం అవుతూనే ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల గురించి మరింత సమాచారం తెలియనుంది. వారాంతాల్లో అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేస్తారు. ఇక, ఇందులో ఎలిమినేషన్ ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంటుందని టాక్.

మొదలైన కంటెస్టెంట్ల ఎంపిక
బిగ్ బాస్ ఐదో సీజన్ పూర్తవడంతో ఇప్పుడందరూ ఓటీటీ వెర్షన్‌పై దృష్టి సారించారు. దీంతో త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫలితంగా చాలా రోజులుగా బిగ్ బాస్ ఓటీటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అలాగే, ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి కూడా.
Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

మాజీ కంటెస్టెంట్‌కు అవకాశం
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఊహించని పరిణామాలను చూపించబోతున్నారట. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్లను కూడా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే అఖిల్ సార్థక్‌కు అవకాశం ఇస్తున్నారట.

ఫైనలిస్టుకు అదిరిపోయే ఆఫర్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఫినాలేకు చేరుకోవడంతో పాటు ఏకంగా రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్‌తో షో నిర్వహకులు తాజాగా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఓటీటీ వెర్షన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చేందుకు అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు బుల్లితెర వర్గాల్లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే, దీనికి అతడు ఒప్పుకున్నాడా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది.