Bigg Boss OTT: ఆ మాజీ కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్.. నాలుగు సీజన్ల నుంచి నలుగురు రీఎంట్రీ

తెలుగు బుల్లితెరపై రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి ఏ భాషలో లేనంతగా మన దగ్గరే ఎక్కువ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది ఇండియాలోనే టాప్ షోగా నిలుస్తూ వస్తోంది. ఇంతటి ప్రభావాన్ని చూపిస్తోన్న ఇది.. ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌ను ప్రారంభించాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఐదు సీజన్లు.. అన్నీ సక్సెస్‌గానే

ఐదు సీజన్లు.. అన్నీ సక్సెస్‌గానే

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. కొత్త కంటెంట్‌తో వచ్చినా ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను అందించారు. ఫలితంగా మన దగ్గర ఈ షో సూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఇప్పటికే ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో మన బిగ్ బాస్ ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది.

తెలుగులో సరికొత్త ప్రయోగానికి

తెలుగులో సరికొత్త ప్రయోగానికి

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌ కొద్ది రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున దీని గురించి మాట్లాడి అంచనాలు పెంచేశాడు.

ఓటీటీ వెర్షన్‌‌‌తో రాబోతున్నారు

ఓటీటీ వెర్షన్‌‌‌తో రాబోతున్నారు

రెగ్యూలర్ బిగ్ బాస్‌తో పాటు ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైన విషయం తెలిసిందే. హిందీలో ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా దీన్ని మొదలెట్టబోతున్నారు. మొదటి సీజన్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు.

24 గంటలూ అందులో ప్రసారం

24 గంటలూ అందులో ప్రసారం

తెలుగు బిగ్ బాస్ షోలా ఓటీటీ వెర్షన్ టీవీ ఛానెల్‌లలో ప్రసారం కాదు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, 24 గంటలూ ఇది ప్రసారం అవుతూనే ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల గురించి మరింత సమాచారం తెలియనుంది. వారాంతాల్లో అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేస్తారు. ఇక, ఇందులో ఎలిమినేషన్ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుందట.

కంటెస్టెంట్ల ఎంపికకు కసరత్తు

కంటెస్టెంట్ల ఎంపికకు కసరత్తు

బిగ్ బాస్ ప్రియులందరూ కొద్ది రోజులుగా ఓటీటీ వెర్షన్‌పై దృష్టి సారించారు. దీంతో త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫలితంగా చాలా రోజులుగా బిగ్ బాస్ ఓటీటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అలాగే, ఎంతో మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.

మాజీ కంటెస్టెంట్లకు అవకాశం

మాజీ కంటెస్టెంట్లకు అవకాశం


కొద్ది రోజుల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఊహించని పరిణామాలను చూపించబోతున్నారట. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్లను కూడా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

నలుగురు ఫైనలిస్టులకు ఆఫర్

నలుగురు ఫైనలిస్టులకు ఆఫర్


బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం ముగ్గురు లేదా నలుగురు మాజీ కంటెస్టెంట్లను తీసుకుంటున్నారట. ఇందులో భాగంగానే ఫస్ట్ సీజన్ ఫైనలిస్టు హరితేజ, రెండో సీజన్ ఫైనలిస్ట్ గీతా మాధురి, మూడో సీజన్ ఫైనలిస్టు శ్రీముఖి, నాలుగో సీజన్ ఫైనలిస్టు అఖిల్ సార్థక్‌లను నిర్వహకులు సంప్రదించారట. అయితే, వీళ్లలో ఎవరు ఫైనల్ అవుతారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X