Bigg Boss OTT: బిగ్ బాస్‌లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. సన్నీని గెలిపించి ఇప్పుడు స్వయంగా రంగంలోకి!
తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నా.. మన దగ్గర మాత్రమే ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు.
Recommended Video
దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లనంటూ ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. గత సీజన్‌లో సన్నీని విజేతగా నిలపడంలో సక్సెస్ అయిన ఓ కంటెస్టెంట్ ఈ సారి ఎంట్రీ ఇస్తున్నాడట. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చింది.. సక్సెస్ అయింది
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఇండియాలో ముందుగా హిందీలో వచ్చిన ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా ఎదిగింది. అదే సమయంలో ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

సరికొత్త ప్రయోగం చేస్తున్న టీమ్
తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ గత నెలలోనే ముగిసింది. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్‌గా చేయనున్న నాగార్జున దీని గురించి మాట్లాడి ఓటీటీ వెర్షన్‌పై అంచనాలు భారీగా పెంచాడు.

రోజంతా అందులో ప్రసారం చేసి
గత ఏడాదే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైంది. అక్కడ ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఈ షోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేస్తారు.

కంటెస్టెంట్ల ఎంపిక.. సెట్ పనులు
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఎప్పుడో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో పాల్గనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయింది. అంతేకాదు, దాదాపు 30 మందితో షార్ట్ లిస్టును కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోందట. పాత హౌస్‌లో కీలక మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారట.

డేట్, కంటెంసెంట్లు, రోజులు ఇలా
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ సీజన్ 82 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో మాజీ కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అని సమాచారం.

నిహారిక క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీకి రెడీ
ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరినట్లు తాజాగా తెలిసింది. ఇందులో సినిమా, సీరియల్ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లతో పాటు సోషల్ మీడియా స్టార్లను దింపబోతున్నారట. దీని కోసం ఇప్పటికే నిర్వహకులు చాలా మందితో చర్చలు జరిపారట. ఇందులో భాగంగానే ప్రముఖ యాంకర్, నిహారిక క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్‌తో చర్చలు జరిపారని టాక్.

సన్నీ విజయం కోసం ఎంతో కష్టం
ఆర్జేగా, యాంకర్‌గా, యూట్యూబర్‌గా ఎంతో ఫేమస్ అయిన నిఖిల్ బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఇప్పటికే అతడు దీనికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడని తెలుస్తోంది. ఐదో సీజన్‌లో సన్నీ కోసం అతడు షోలోకి కూడా వచ్చాడు. అతడి విజయం కోసం బాగా శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వయంగా బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టబోతున్నాడు.


Click it and Unblock the Notifications











