twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

    |

    తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని.. తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఐదింటిని విజయవంతంగా ముగించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు.

    త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సీజన్‌కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే ఓ కంటెస్టెంట్ పేరు తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

    మరో ప్రయోగంతో వస్తున్నారు

    మరో ప్రయోగంతో వస్తున్నారు

    బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. ప్రతి ఏడాది ఒక సీజన్‌ను జరుపుకుంటూ వచ్చిన నిర్వహకులు.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు. దీంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చమరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

     రోజంతా అందులోనే ప్రసారం

    రోజంతా అందులోనే ప్రసారం

    ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో హిందీలో గత ఏడాది ప్రసారం చేశారు. అక్కడ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా పరిచయం చేస్తున్నారు. దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో ప్రసారం చేయరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

    ఓటీటీ పనుల పూర్తి వివరాలు

    ఓటీటీ పనుల పూర్తి వివరాలు

    ఫిబ్రవరి నెల నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన అన్ని పనులనూ ప్రారంభించారు. సెట్ వర్క్‌ను దాదాపుగా పూర్తి చేసేశారు. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

    జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

    డేట్, కంటెస్టెంట్లు, రోజులిలా

    డేట్, కంటెస్టెంట్లు, రోజులిలా

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని తెలిసింది.

    వాళ్లు కూడా రీఎంట్రీ ఇచ్చేలా

    వాళ్లు కూడా రీఎంట్రీ ఇచ్చేలా

    మరికొన్ని వారాల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక, ఇందులో ముగ్గురు లేదా నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో చర్చలు జరుపుతున్నారట.

    హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చహాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

    షోలోకి ఫేమస్ హీరోయిన్ రాక

    షోలోకి ఫేమస్ హీరోయిన్ రాక

    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌కు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెలెబ్రిటీ పేరు కూడా లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలోకి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే ఆమె అగ్రిమెంట్‌పై సైన్ కూడా చేసిందట.

    Recommended Video

    Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
    ఈమెకే రెమ్యూనరేషన్ భారీగా

    ఈమెకే రెమ్యూనరేషన్ భారీగా

    బుల్లితెరపై చాలా కాలంగా వరుస సీరియళ్లతో నవ్య స్వామి సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు జీ తెలుగులో ‘సూపర్ క్వీన్', ఈటీవీలో ‘ఢీ 14' షోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకులు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీనికి టెంప్ట్ అయిన నవ్య స్వామి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఆమె ఓటీటీ కంటెస్టెంట్‌గా రాబోతుంది.

    English summary
    Bigg Boss Show Completed Five Seasons Successfully. Now Makers Planing for OTT Season. Recently BB Team Approached Navya Swamy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X