Bigg Boss: మరో మాజీ కంటెస్టెంట్‌‌కు బంపర్ ఆఫర్.. అప్పుడు మధ్యలోనే ఔట్.. ఇప్పుడేమో బిగ్ డీల్!

తెలుగు బుల్లితెరపై గతంలో దేనికి దక్కనంత రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం అందుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అందుకే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మాజీ కంటెస్టెంట్ పేరు లీకైంది. ఇంతకీ ఎవరది? పూర్తి వివరాలు మీకోసం!

తెలుగులోనే కాదు.. దేశంలోనే టాప్

తెలుగులోనే కాదు.. దేశంలోనే టాప్

తెలుగులో బిగ్గెస్ట్ హిట్ షోగా పేరు సంపాదించుకున్న ఏకైక కార్యక్రమమే బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ఇది ప్రసారం అవుతున్నా.. మన దగ్గర వచ్చేది మాత్రమే భారీ స్పందనతో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఏకంగా ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో భారీ రేటింగ్‌ను అందుకుని దేశంలోనే టాప్ షోగా రికార్డులు నమోదు చేసుకుందీ బిగ్ బాస్.

బిగ్ బాస్ నుంచి మరో కొత్త సీజన్‌తో

బిగ్ బాస్ నుంచి మరో కొత్త సీజన్‌తో

రెగ్యూలర్ బిగ్ బాస్ సీజన్.. అంటే ఐదోది కొద్ది రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా నాగార్జున దీని గురించి మాట్లాడి అంచనాలను భారీగా పెంచాడు.

ఓటీటీలో 24గంటల పాటు ప్రసారం

ఓటీటీలో 24గంటల పాటు ప్రసారం

గత ఏడాదే హిందీలో బిగ్ బాస్‌ ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైన విషయం తెలిసిందే. అక్కడ ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా దీన్ని మొదలెట్టబోతున్నారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. దీన్ని హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేయబోతున్నారు.

స్పీడు పెంచిన కంటెస్టెంట్ల ఎంపిక

స్పీడు పెంచిన కంటెస్టెంట్ల ఎంపిక

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ షోను అభిమానించే వాళ్లందరూ ఇప్పుడు ఓటీటీ వెర్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. దీనికంటే ముందు ఇందులో ఎవరు పాల్గొనబోతున్నారన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే, ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఎప్పుడో మొదలైంది. సమయం దగ్గర పడడంతో ఈ ప్రక్రియను ముమ్మరం చేసేశారని తెలిసింది.

సీజన్‌లోకి మాజీ కంటెస్టెంట్లు కూడా

సీజన్‌లోకి మాజీ కంటెస్టెంట్లు కూడా

ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ కోసం గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా తీసుకు రాబోతున్నారట. అందులోనూ మొదటి నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాక్.

మధ్యలోనే వెళ్లిన కంటెస్టెంట్‌ రాక

మధ్యలోనే వెళ్లిన కంటెస్టెంట్‌ రాక

బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌కు సంబంధించి మొత్తం 14 మంది వరకూ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు కానీ, నలుగురు కానీ మాజీ సభ్యులు ఉంటారని ముందే చెప్పుకున్నాం. దీని కోసం ఇప్పటికే నిర్వహకులు చాలా మందితో చర్చలు జరిపారట. ఇందులో భాగంగానే తాజాగా నాలుగో సీజన్ కంటెస్టెంట్ నోయల్ సీన్‌కు ఆఫర్ ఇచ్చారట.

ఇప్పుడు బిగ్ డీల్‌తో ప్రయత్నాలు

ఇప్పుడు బిగ్ డీల్‌తో ప్రయత్నాలు

నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా వచ్చిన నోయల్ సీన్.. ఆరంభంలోనే చక్కగా ఆడి టైటిల్ ఫేవరెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ, మధ్యలో గాయాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో 53వ రోజు అనారోగ్య కారణాలతో హౌస్‌ను వీడాడు. ఈ నేపథ్యంలో అతడికి బిగ్ బాస్ టీమ్ ఓటీటీ ఆఫర్ ఇచ్చిందట. ఇందుకోసం భారీ మొత్తం చెల్లిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X