Bigg Boss OTT: షోలోకి టాలీవుడ్ కాంట్రవర్శీ కింగ్.. వామ్మో ఇక హౌస్‌లో కూడా రచ్చ రచ్చే

అప్పటి వరకూ సాదాసీదాగా సాగిపోతోన్న తెలుగు బుల్లితెరను ఒక్కసారిగా పైకి లేపడంతో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపును అందిస్తూ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చినప్పటికీ.. ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో మద్దతును ప్రకటించారు. దీంతో ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది.

Recommended Video

Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu

ఫలితంగా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే ఒక సంచలన కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరది? పూర్తి వివరాలు మీకోసం!

చరిత్రను సృష్టించిన తెలుగు షో

చరిత్రను సృష్టించిన తెలుగు షో

హిందీలో బిగ్ బాస్ పదిహేనేళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇది చాలా ప్రాంతీయ భాషల్లోకి పరిచయం అయింది. ఇలా ఐదేళ్ల క్రితమే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో దాన్ని నాని, మూడు నుంచి ఐదు వరకూ నాగార్జున హోస్ట్ చేశారు. ఇవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో బుల్లితెరపై ఈ రియాలిటీ షో సంచలనం అయిపోయింది.

ఓటీటీ వెర్షన్‌తో మరొక ప్రయోగం

ఓటీటీ వెర్షన్‌తో మరొక ప్రయోగం

గత డిసెంబర్‌లోనే బిగ్ బాస్ ఐదో సీజన్ ముగిసింది. ఫినాలే స్టేజ్‌పైనే షో నిర్వహకులు త్వరలోనే ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత దానికి హోస్టుగా అక్కినేని నాగార్జునే ఉంటాడని ఆయనే చెప్పారు. అంతేకాదు.. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని చెప్పిన నిర్వహకులు ఓటీటీ వెర్షన్‌పై అంచనాలను భారీగా పెంచేశారనే చెప్పాలి.

అందులోనే 24 గంటలు ప్రసారం

అందులోనే 24 గంటలు ప్రసారం

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ గత ఏడాది హిందీలో ప్రసారం అయింది. అక్కడ దీనికి వీక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తెలుగులోకి కూడా తీసుకు వస్తున్నారు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేస్తున్నట్లు ముందే తెలిపారు.

ఓటీటీ వెర్షన్ పనులు ఎలాగంటే

ఓటీటీ వెర్షన్ పనులు ఎలాగంటే

ఫిబ్రవరి మూడవ వారంలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఇందులో పాల్గనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చివరికి వచ్చింది. అంతేకాదు, షార్ట్ లిస్టును కూడా రెడీ చేశారట. అదే సమయంలో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీనికోసం బిగ్ బాస్ హౌస్‌కు మార్పులు చేస్తున్నారు.

షోకు సంబంధించిన వివరాలివే

షోకు సంబంధించిన వివరాలివే

విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందట. ఇది 82 రోజుల పాటు సాగనుందని తెలిసింది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అందులో ముగ్గురు నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇది చాలా కొత్తగా ఉండబోతుందని టాక్.

షోలోకి కాంట్రవర్శీ కింగ్ ఎంట్రీ

షోలోకి కాంట్రవర్శీ కింగ్ ఎంట్రీ

తెలుగులో ప్రసారం కాబోతున్న ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరినట్లు ఇప్పటికే చెప్పుకున్నాం. ఇందులో వెండితెర, బుల్లితెర రంగాలకు చెందిన వాళ్లతో పాటు సోషల్ మీడియా స్టార్లను తీసుకొస్తారట. దీని కోసం ఇప్పటికే నిర్వహకులు చాలా మందితో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా కాంట్రవర్శీ కింగ్ రాకేష్ మాస్టర్ కూడా ఉన్నాడట.

హౌస్‌లో కూడా రచ్చ రచ్చేనని

హౌస్‌లో కూడా రచ్చ రచ్చేనని

కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా టాలీవుడ్‌లో చాలా కాలం పాటు పని చేశారు రాకేష్ మాస్టర్. అయితే, ఆయన ఈ మధ్య కాలంలో ఎవరిని పడితే వాళ్లను తిడుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ఇంటర్వ్యూలు రచ్చ రచ్చగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాకేష్ మాస్టర్ హౌస్‌లోకి వస్తే.. సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X