Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు షోకు నాగార్జున పారితోషికం.. ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు తెలుగు నుంచి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. స్పెషల్ ఆడియెన్స్ ఉన్నారు. ఇందుకే ఇప్పటి వరకు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు గత 6 సీజన్లుగా టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఈ షోకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
2017 నుంచి నాన్ స్టాప్ గా..
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తెలుగు వెర్షన్ లో 2017లో ప్రారంభమైంది. తొలి సీజన్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత 2వ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయడం విశేషం. ఇక 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రతి సీజన్ ను విజయవంతం చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్, రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నటీనటులకు, యంగ్ టాలెంట్స్ ను ప్రోత్సహించే అవకాశం కూడా లభిస్తోంది. ఇక నెక్ట్స్ సీజన్ పై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ హోస్ట్ రెమ్యునరేషన్..
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం. గత ఆరు సీజన్లలో ఆయన కంటెస్టెంట్లను హౌజ్ లో నడిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కోట్లు వెచ్చించి బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు. కాగా కంటెస్టెంట్లకు లక్షల్లో పారితోషికాలు, భారీ ప్రైజ్ మనీ, కాస్ట్లీ గిఫ్ట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ప్రతి సీజన్ కు ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కానీ సినీ ప్రముఖుల ప్రకారం 30 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటారని చెబుతున్నారు.
బిగ్ బాస్ విన్నర్స్ లిస్ట్..
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షోకు మొదటి సీజన్ విజేతగా నటుడు శివ బాలాజీ టైటిల్ ను అందుకున్నారు. ఆ తర్వాత 2వ సీజన్ లో కౌశల్ మందా, 3వ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, 4వ సీజన్ లో అభిజీత్, 5వ సీజన్ లో వీజే సన్నీ, 6వ సీజన్ లో ఎల్వీ రేవంత్, 7వ సీజన్ లో పల్లవి ప్రశాంత్, 8వ సీజన్ లో నిఖిల్ మాలియక్కల్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 9వ సీజన్ లో టైటిల్ ను గెలుచుకునే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.
కూలితో తొలిసారిగా..
అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు తన కెరీర్ లో హీరోగానే అలరించిన సంగతి తెలిసిందే. ఆయన 30 ఏళ్లకు పైగా కెరీర్ లో తొలిసారిగా విలన్ పాత్ర పోషించారు. సైమన్ గా కూలి చిత్రంతో అలరించబోతున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. లోకేష్ కగనరాజ్ దర్శకత్వం వహించారు. రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఉపేంద్ర, సత్యరాజ్, సౌబీన్ షహిర్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











