Bigg Boss 5: చిర్రెత్తిపోయిన కాజల్‌.. దాన్ని ముఖం మీద విసరడంతో సీరియస్ అయిన సన్నీ!

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కు దగ్గరవుతున్న కొద్దీ కంటెస్టెంట్స్ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా హౌస్ మెంట్స్ వారిలోని విభిన్నమైన రంగులను బయటపెడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా అందుకే తగ్గట్టుగానే టాస్క్ లు ఇస్తున్నారు. ఇక ఆటలో కొందరు సహనాన్ని కోల్పోతున్నారు. వివిధ రకాలుగా వారిలోని కోపాన్ని బయటపెడుతున్నారు. ఇక రీసెంట్ గా కాజల్ అయితే సన్నీ విషయంలో ఒక్కసారిగా చిర్రెత్తిపోయింది. బిగ్ బాస్ కు గత వారం నుంచి రేటింగ్స్ కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

 ఆసక్తిని చూపలేదు

ఆసక్తిని చూపలేదు

బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పుడు సెలబ్రెటీల ఎంట్రీ విషయంలో జనాలు పెద్దగా ఆసక్తిని చూపలేదు. యాంకర్ రవి, కాజల్, షణ్ముఖ్ జస్వంత్ మాత్రమే హైలెట్ గా నిలుస్తూ వచ్చారు. లోబో అయితే ఫైనల్స్ వరకు ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతను ఏ టాస్క్ లలో కూడా అనుకున్నంతగా రానించకపోవడంతో తొందరగానే వెళ్లిపోయాడు.

ఎలిమినేషన్ లో మోసం..

ఎలిమినేషన్ లో మోసం..

బిగ్ బాస్ ద్వారా కొందరు మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక యాంకర్ రవి తొందరగా హౌస్ లో నుంచి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతని ఫాలోవర్స్ ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వెళ్లి మరీ గొడవ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ లో మోసం జరిగిందని రవి అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు.

సన్నీపై కాజల్ అసహనం

సన్నీపై కాజల్ అసహనం

ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారందరు కూడా మంచి గేమ్ స్పిరిట్ తో ముందుకి సాగుతూ ఉండగా మధ్యలో కాస్త కాజల్ మళ్ళీ సహనం కోల్పోయి గేమ్ ను మార్చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మొన్నటివరకు సన్నీతో చాలా క్లోజ్ గా ఉన్న కాజల్ ఇప్పుడు అతనితో కూడా వైరానికి దిగింది. ఎలపడితే అలా తిట్టేస్తూ అరుస్తూ మళ్ళీ ఎమోషనల్ గా ఫీల్ అవుతోంది.

సన్నీ వెంటపడిన కాజల్

సన్నీ వెంటపడిన కాజల్

గేమ్‌లో ఉంటే తనను డిస్టర్బ్ చేయవద్దని చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ సన్నీని కాజల్ బాగానే డిస్టర్బ్ చేసింది. ఇక ఆ తరువాత మళ్ళీ అమాయకంగా సారీ అంటూ అతని వెంట పడింది. ఇక సన్నీ సైలెంట్ గానే ఆమె మాటలను ఏమి పట్టించుకోలేదు. ఒక విధంగా సన్నీ కూడా స్వీట్ గా ఆమెను మరింత రెచ్చగొట్టాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
కామన్‌సెన్స్‌ లేదా?

కామన్‌సెన్స్‌ లేదా?

ఎంగా బ్రతిమాలినా కూడా పట్టించుకోకపోవడంతో సహనం కొల్పయిన కాజల్.. చిర్రెత్తిపోయి చేతిలో ఉన్న టిష్యూ పేపర్‌ను ముఖం మీద కొట్టేసింది. ఇక అసహనానికి లోనైన సన్నీ కాజల్ పై సడన్ గా అరిచేశాడు. కామన్‌సెన్స్‌ లేదా అంటూ కౌంటర్ ఎటాక్ చేయడంతో.. కాజల్‌ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. ఇక సన్నీ ఆమె విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆటపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతున్నట్లు సోషల్ మీడియాలో హడావిడి చూస్తేనే అర్ధమవుతోంది. మరి అతను బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X