Bigg Boss Telugu Road to finale: హారిక, అభిజిత్ ఔట్.. ప్రత్యర్థులుగా మారిన అఖిల్, సోహెల్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో రోడ్ టూ ఫినాలే టాస్క్ తుది అంకానికి చేరుకోనున్నది. గురువారం ఎపిసోడ్‌లో ఫినాలేలో అడుగుపెట్టే ఇంటి సభ్యుడు ఎవరో తెలిసి పోతుంది. 87వ రోజున ఇంటిలో రోడ్ టూ ఫినాలేలో ఏం జరిగిందంటే...

రోడ్ టూ ఫినాలే లెవల్ 2 కోసం
రోడ్ టూ ఫినాలే లెవల్ 2 కోసం అఖిల్, అభిజిత్, హారిక, సోహెల్ పోటీ పడ్డారు. టాస్క్‌లో భాగంగా మట్టి తొట్టిలో పూలను నాటాలి. ఇంటి పై నుంచి పడే పూలను ఏరుకొని వాటిలో నాటాలి. ఎవరి వద్ద తక్కువ పూలు తమ తొట్టిలో నాటుతారో వారు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ గేమ్ రూల్ చెప్పారు.

హారికపై బల ప్రదర్శనతో
టాస్క్‌లో భాగంగా పూలు సేకరించే టాస్క్‌లో అఖిల్, సోహెల్ తమ బల ప్రదర్శనతో హారికను ఇబ్బంది పెట్టారు. దాంతో ఆమె సహనం కోల్పోయి ఇలా నన్ను తోసేసి.. ఫిజికల్‌గా ఎటాక్ చేస్తే గేమ్ ఎలా ఆడాలి అంటూ హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే గేమ్ ఆఢటం కష్టమని ఏడ్చేసింది.

హారికకు సపోర్టుగా
రోడ్ టూ ఫినాలే లెవల్ టూ టాస్క్ గందరగోళం మధ్య సాగింది. హారికకు అరియానా, అవినాష్ సపోర్టు చేశారు. తొలి బజర్ మోగిన తర్వాత ఇంటి సభ్యులు తమ వద్ద ఉన్న పూల సంఖ్యను చెప్పారు. ధాంతో తక్కువ పూలను సాధించిన హారికను గేమ్ నుంచి బిగ్‌బాస్ తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

గేమ్ నుంచి తప్పుకొన్న అభిజిత్
ఆ తర్వాత పోటీ అఖిల్, సోహెల్, అభిజిత్ మధ్య జరిగింది. ఈ పోటీలో అభిజిత్‌పై అధిక్యం ప్రదర్శిస్తూ పూలను ఎక్కువ సంఖ్యలో సాధించారు. చివరి బజర్ మోగిన తర్వాత ఇంటి సభ్యులు పూలను లెక్కించారు. సోహెల్ 70కి పైగా, అఖిల్ 80కిపైగా, అభిజిత్ 40కిపైగా పూలను సాధించారు. దాంతో గేమ్ నుంచి అభిజిత్ తప్పుకున్నారు.
Recommended Video

చివరి పోటికి అఖిల్, సోహెల్
ఇక రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో చివరి పోటికి అఖిల్, సోహెల్ సిద్ధమయ్యారు. వారికి ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. ఉయ్యాలపై నుంచి దిగకుండా చివరి వరకు ఎవరు ఉంటారో వారే ఫినాలేలోకి ప్రవేశిస్తారని గేమ్ రూల్ చెప్పారు. ఈ గేమ్ గురువారం ఎపిసోడ్‌లో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











