Pallavi Prashanth రైతు బిడ్డను అంత వల్గర్‌గా తిడుతారా? పల్లవి ప్రశాంత్‌పై బిగ్‌బాస్ రన్నర్ అఖిల్ సార్థక్

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండోవారంలోకి ప్రవేశించింది. నామినేషన్, ఎలిమినేషన్, టాస్కులతో ఇళ్లంతా సందడిగా కనిపించింది. అయితే సందడితోపాటు ఇంటిలో గొడవలు, అలకలు, ఏడుపులు కూడా అదే రేంజ్‌లో కనిపించాయి. రెండోవారం నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యులను యాక్షన్ మోడ్‌లోకి తెచ్చాయి. దాంతో ఇక చెప్పేదేముంది.. ఒకరిపై మరోకరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను ఇంటి సభ్యులు టార్గెట్ చేసిన తీరు వివాదంగా మారుతున్నది. దాంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసు ఫేవరట్స్‌లో ఒకరిగా మారేలా చేశాయి. అయితే పల్లవి ప్రశాంత్‌ను ఇంటి సభ్యులు టార్గెట్ చేసిన తీరుపై బిగ్‌బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ స్పందిస్తూ..

బిగ్‌బాస్ 7 తెలుగు రెండోవారం నామినేషన్ల సమయంలో సీరియల్ నటులందరూ పల్లవి ప్రశాంత్‌పై ముకూమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రైతు బిడ్డ అంటూ సింపతి, సానుభూతి పొందకు. ఇంటిలో ఆట ఆడి ప్రజల మనసులు గెలుచుకోంటూ మాటలతో ఎటాక్ చేశారు. ఓ దశలో అమర్ దీప్ సహనం కోల్పోయి.. అరేయ్.. ఓరేయ్.. ఏందిరా అంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. రైతు బిడ్డవు అయితే.. ఏంటి? బీటెక్ చదివిన వాళ్లు ఉద్యోగాలు లేకుండా చచ్చిపోతున్నారు అంటూ ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు.

Bigg Boss Telugu Runner Akhil Sarthak emotional video on Raitu Bidda Pallavi Prashanth

బిగ్‌బాస్‌లో రెండోవారం నామినేషన్ల ప్రక్రియకు ముందు వరకు పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉన్న రతిక రోజ్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించింది. అప్పటి వరకు సెన్సిబుల్‌గా చిన్న రొమాంటిక్ టచ్‌తో లవ్ ట్రాక్ నడిపిన రతిక.. ప్రశాంత్‌పై మాటల యుద్దం చేసింది. బిగ్‌బాస్ ఆఫర్ కోసం కుక్కలా తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటూ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది.

Bigg Boss Telugu Runner Akhil Sarthak emotional video on Raitu Bidda Pallavi Prashanth

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసిన విధానంపై అనుకూలంగా, ప్రతికూలంగా నెటిజన్లు స్పందిస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌పై ఇంటి సభ్యులు టార్గెట్ చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. రైతును కించపరిచేలా మాట్లాడుతున్నారు. వారికి రైతుల బాధల గురించి తెలుసా? రైతులను చిన్నచూపు చూసేలా మాట్లాడటం తగదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ వీడియోను రిలీజ్ చేసి ప్రశాంత్‌కు సంఘీభావం పలికాడు.

Bigg Boss Telugu Runner Akhil Sarthak emotional video on Raitu Bidda Pallavi Prashanth

నామినేషన్స్ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసిన విధానం చూసి బాధేసింది. లైవ్ చూస్తూ వెంటనే వీడియో పెట్టాను. ప్రశాంత్‌ను టార్టెగ్ చేసిన విధానం గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడాలని అనుకొంటున్నాను. ప్రశాంత్‌ను ఓరేయ్, అరేయ్.. ఏందిరా? అంటూ బూతులు తిట్టినట్టు మాట్లాడారు. మామూలుగా రా, ఒరేయ్ అనడం ఒకే. కానీ నామినేషన్స్‌లో అలా అనడం సరికాదు. ఇలా వల్గర్ మాట్లాడటం సరికాదు అని అఖిల్ సార్థక్ అన్నాడు.

ప్రశాంత్ స్థానంలో శివాజీ ఉంటే వేరేలా ఉండేది. బిగ్‌బాస్‌లోకి రావాలని చేతులు జోడించి వేడుకొన్నాడు. ఎవరైనా ఏదైనా కోరుకొనే సమయంలో చేతులు జోడించడం సహజం. అడుక్కొని వచ్చావు అంటూ అవహేళన చేశారు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత తన గేమ్ తాను ఆడుతున్నాడు. కంటెస్టెంట్లు టార్గెట్ చేసినా.. అక్కా.. అన్నా అంటూ వారిని చాలా ఈజీగా తీసుకొన్నాడు అని అఖిల్ సార్థక్ చెప్పారు.

Bigg Boss Telugu Runner Akhil Sarthak emotional video on Raitu Bidda Pallavi Prashanth

ఇక అప్పటి వరకు ప్రశాంత్‌తో రతిక ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చింది. రతిక టోటల్‌గా ఛేంజ్ అయింది. మొదట ప్రశాంత్‌కు చాలా హోప్ ఇచ్చింది. వెంటనే ప్లేట్ ఫిరాయించింది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? అని ప్రశ్నించింది. లవ్ ట్రాక్ నడుపాలని చూసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. నామినేసన్లలో రతిక చేసిన పని నాకు నచ్చలేదు. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌లో రాక్ చేస్తాడు అని అఖిల్ సార్థక్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X