అమ్మా రాజశేఖర్‌కు చెమటలు పట్టించిన బిగ్‌బాస్.. 5వవారం జోర్దారుగా ఎలిమినేషన్.. బిగ్‌బాంబ్ ఎవరిపై అంటే
సండే రోజు ఫన్‌డే కావడంతో ఆట పాటలతో ఇంటి సభ్యులు ఉషారుగా ఆడి పాడారు. డమ్ చరేడ్ ఆట ఆడుతూ సినిమా పేరు ప్రకారం ఒకరు యాక్ట్ చేస్తే మరొకరు ఆ సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరితో అలా ఆటను ఆడిస్తూ ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు వినోదాన్ని హోస్ట్ నాగార్జున పంచారు. అలా ఆటను సరదాగా కొనసాగిస్తూ.. అవినాష్‌ను టీజ్ చేయిస్తూ నాగ్ ముందుకు వెళ్తూ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిందంటే..

డమ్ చరేడ్ ఆడిస్తూ.. అరియానా, నోయల్‌ను సేఫ్
డమ్ చరేడ్ గేమ్ మధ్యలో ఓ వీడియోను చూపించి అరియానాను మూడో కంటెస్టెంట్‌గా సేఫ్ చేశారు. ఆ తర్వాత డమ్ చరేడ్ ఆట తర్వాత మధ్యలో ఆపేసి మరో ఇంటి సభ్యుడిని సేఫ్ చేసే ప్రక్రియను చేపట్టారు. అవినాష్‌కు ఒక కవర్ ఇచ్చి అందులో ఉన్న పేరు వ్యక్తిని అనుకరిస్తూ యాక్ట్ చేస్తే.. ఆ వ్యక్తి సేఫ్ అవుతారని నాగ్ చెప్పారు. కవర్‌లో పేరు చూసి ఓ స్టైల్‌లో నడిచి కౌగిలింత ఇచ్చినట్టు అనుకరించడంతో నోయల్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత నోయల్ సేఫ్ అంటూ నాగార్జున ప్రకటించారు.

అభిజిత్, లాస్య సేఫ్
మూడో కంటెస్టెంట్‌ను సేఫ్ చేయడానికి ఓ పజిల్‌ను ఇచ్చారు. ప్లకార్డుపై సేవ్ అని రాసిన ముక్కులను పేర్చాలి. ముక్కలన్నీ సరిగా కలిపితే సేవ్ అని వస్తే వారు సేఫ్ అవుతారు. మొదట అభిజిత్‌కు ఇచ్చిన ముక్కలు కలిపితే సేవ్ అని చక్కగా కుదిరాయి. ఆ తర్వాత సుజాత ముక్కలు సరిగా కుదరకపోవడంతో సేవ్ కాలేదని చెప్పారు. ఆ తర్వాత అమ్మా రాజశేఖర్, మోనాల్ పజిల్ కూడా సెట్ కాకపోవడంతో వారు కూడా సేఫ్ కాలేదని చెప్పారు. చివరకు లాస్య ముక్కలు కలవడంతో వారు సేవ్ నాగ్ ప్రకటించారు.

చివరిగా ఎలిమినేషన్‌లో ఆ ముగ్గురు
ఇక ఇంటిలో నామినేషన్‌లో ముగ్గురు మిగిలారు. మోనాల్, సుజాత, అమ్మా రాజశేఖర్ ముగ్గురు మిగలడంతో వారిని గార్డెన్‌లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నారు. ముగ్గురిలో మోనాల్‌ను సేవ్ అని ప్రకటించారు. మిగిలిన సుజాతను, అమ్మా రాజశేఖర్ గార్డెన్ ఏరియాలో పెట్టిన ఐస్ ముక్కల్ని పగలగొడితే అందులో ఓ కార్డు ఉంటుంది. అందులో ఎవరిఫోటో ఉండి పక్కనే ఎవిక్టెడ్ అని ఉంటే వారు ఎలిమినేట్ అవుతారు అని నాగ్ చెప్పారు. అయితే ఐస్ ముక్కల్ని అమ్మా రాజశేఖర్, సుజాత పగలకొట్టగా అందులో సుజాత ఫోటో ఉండటంతో ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు.

నాగ్‌తో వేదికపైన సుజాత
ఇంటిలో తనను ప్రేమగా చూసుకొన్న నోయల్ సీన్, లాస్య, అవినాష్‌కు ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్న బోర్డుపై హార్ట్ సింబల్ అతికించారు. ఇక ఇంటిలో తన మనసును కకావికలం చేసిన వారిలో అభిజిత్, అమ్మా రాజశేఖర్, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, అవినాష్ ఉన్నారని, వారికి బ్రోకెన్ హార్ట్ సింబల్ పెట్టి అందుకు కారణాలను వెల్లడించారు.
Recommended Video

సోహైల్‌పై వేసిన బిగ్‌బాంబు ఏమిటంటే
ఆ తర్వాత బిగ్‌బాంబు వేసే కార్యక్రమం మొదలైంది. బిగ్ బాంబ్ ప్రకారం.. ఇంటిలోని వంట పాత్రలన్నీ కడిగే శిక్ష విధించాల్సి ఉంటుంది. ఆ బాంబును కెప్టెన్ సోహైల్‌పై వేసింది. కెప్టెన్‌పై వేసే అర్హత లేదంటూ సోహైల్ వాదించాడు. అయితే కెప్టెన్‌కు ఎలిమినేషన్ కోసం ఇమ్యునిటీ ఉంది కానీ బిగ్‌బాంబు విషయంలో లేదు అని నాగ్ చెప్పడంతో సోహైల్‌పై బిగ్‌బాంబ్ పడింది.


Click it and Unblock the Notifications











