జూన్ 10 నుండి బిగ్ బాస్ తెలుగు 2.... 100 రోజులు, 16 మంది సెలబ్రిటీలు!
Recommended Video

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. జూన్ 10 నుండి నాని హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదలు కాబోతోంది. ఈ మేరకు స్టార్ మా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. సినీ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సారి షోలో భాగం కాబోతున్నారు.
100 రోజులు, 16 మంది సెలబ్రిటీలు
ఈ షోను హోస్ట్ చేస్తున్న హీరో నాని ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. 'జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. ' అంటూ నాని ట్వీట్ చేశారు. గత సీజన్ మాదిరిగానే సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు... శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో మొదలు కాబోతోంది.
నాని హోస్ట్ చేస్తుండటంతో కొత్త జోష్
బిగ్ బాస్ తెలుగు గతేడాది ప్రారంభం అవ్వగా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడంతో టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్నంటాయి. ఈ సారి ఎన్టీఆర్ స్థానంలో నాని వచ్చారు. ఈ నేచురల్ స్టార్ రాకతో బిగ్ బాస్ సీజన్ 2 సరికొత్త లుక్ సంతరించుకుంది. బిగ్ బాస్ అభిమానుల్లో కూడా కొత్త జోష్ నెలకొంది.

ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది?
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన మాధవి లతతో పాటు పలువురు యాక్టర్లకు బిగ్ బాస్ నిర్వాహకులు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు కొందరు టీవీ యాంకర్లు, నటులకు ఆహ్వానాలు అందాయట. ఫైనల్‌గా ఎవరు బిగ్ బాస్ 2 ఇంట్లోకి ఎంటర్ అవుతారో చూడాలి.

సీజన్ 2లో అనేక మార్పులు
తొలి సీజన్ 70 రోజుల పాటు, 14 మంది సెలబ్రిటీలతో సాగింది. అయితే సీజన్ 2లో చాలా మార్పులు చేశారు. ఈ సారి 100 రోజుల పాటు షో సాగబోతోంది. కంటెస్టెంట్స్ సంఖ్య కూడా 14 నుండి 16కు పెంచారు.


Click it and Unblock the Notifications











