బిగ్ బాస్-2: సంజన ఔట్, గోగినేనిపై బిగ్ బాంబ్... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న సెక్సీ బ్యూటీ!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Sanjana Anne Eliminated From Bigg Boss House

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా.... అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి బయటకు వెళతారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొgది. ఈ ఉత్కంఠకు తెర దించుతూ ఆదివారం రాత్రి జరిగిన షోలో బయటకు వెళ్లేది ఎవరో తేలిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో ఓవరాక్షన్ చేస్తూ కేవలం ఇంటి సభ్యులకు మాత్రమే కాదు, ప్రేక్షకులకు సైతం చికాకు తెప్పించిన సంజన షో నుండి ఔట్ అయిం

తొలి రోజు నుండి వివాదాలు

తొలి రోజు నుండి వివాదాలు

సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్న ఈ మిస్ హైదరాబాద్ తొలి రోజు నుండే అలజడి సృష్టించడం మొదలు పెట్టించింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తన ప్రవర్తనతో ప్రేక్షకులకు చికాకు తెప్పించి ఇంట్లో కొనసాగే అవకాశం దూరం చేసుకుంది.

తేజస్వితో తరచూ గొడవలు

తేజస్వితో తరచూ గొడవలు

తేజస్వితో ప్రతిక్షణం గొడవ పడుతూ ఆమెపై విద్వేషాన్ని పెంచుకున్న సంజన... ప్రేక్షకుల మార్కులు దక్కించుకోవడంలో విఫలమైంది. ఒక రకంగా ఆమె ఉంటే బిగ్ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా అసూయ, ద్వేషం లాంటి వాటితో పొల్యూట్ అవుతారేమో? అని స్థాయిలో ప్రేక్షకులు అనుమాన పడేంతలా సంజన అతిగా ప్రవర్తించడమే ఈ పరిణామాలకు దారి తీసినట్లు స్పష్టమవుతోంది.

ఇంటి నుండి బయటకొస్తూ ఆ ఇద్దరిపై విమర్శలు

ఇంటి నుండి బయటకొస్తూ ఆ ఇద్దరిపై విమర్శలు

బిగ్ బాస్ ఇంట్లో నుండి బయటకు వస్తూ సంజన.... తేజస్వి, బాబు గోగినేనిలపై విమర్శల వర్షం కురిపించింది. తేజస్వి పక్కవారితో సవ్యంగా ఉండాలని, అందరినీ సమానంగా చూసే తత్వం ఆమెకు లేదని మండి పడింది. బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి కాదని, ఇది కేవలం తన అభిప్రాయమని సంజన తెలిపారు.

బాబు గోగినేనిపై బిగ్ బాంబ్

బాబు గోగినేనిపై బిగ్ బాంబ్

బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లకు ఇంట్లో ఎవరైనా ఒకరిపై బిగ్ బాంబ్ వేసే అవకాశం ఉంటుంది. ఈ సారి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సంజన ...... బాబు గోగినేనిపై ప్రయోగించింది. ఈ మేరకు బాబు గోగినేని ఈ వారం ఎవరికీ మంచి నీళ్లు అవసరం వచ్చినా స్వయంగా అందివ్వాలి.

నందినీ రాయ్ అనే కొత్త బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

నందినీ రాయ్ అనే కొత్త బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ ఇంట్లోకి నందినీ రాయ్ అనే కొత్త హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎప్పుడు హౌస్‌లోకి వెళుతుందనే విషయమై ఇంకా క్లారిటీ లేదు. ఇది ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X