బిగ్‌బాస్ 2: ఎన్టీఆర్ తప్పుకుంది అందుకే.. రోజూ సంచలనాలే, ఇండియాలో ఆయన్ని ఎవరూ కొట్టలేరు.. నాని

Recommended Video

Bigg Boss Telugu Season 2 Press Meet: Nani Speech

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో అభిమానులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టివి కార్యక్రమాలలో ఇటీవల అత్యంత ఆదరణ పొందిన షో ఇదే కావడం విశేషం. తెలుగులో స్టార్ మా ఈ క్రేజీ రియాలిటీ షోని ప్రసారం చేయనుంది. తెలుగులో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ సూపర్ హిట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న రెండవ సీజన్ అంతకు మించేలా ఉటుందని బిగ్ బాస్ టీం చెబుతోంది. జూన్ 10 నుంచి ఈ రియాలిటీ షో ప్రసారం అవుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. న్యాచురల్ స్టార్ నాని తో సహా బిగ్ బాస్ టీం మొత్తం నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని షో గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

వినోదానికి కొత్త అర్థం

వినోదానికి కొత్త అర్థం

బుల్లితెర ప్రేక్షకులని వినోదంతో ముంచెత్తడానికి బిగ్ బాస్ 2 అన్ని హంగులతో ముస్తాబవుతోంది. జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ 2 సీజన్ 106 రోజులపాటు కొనసాగనుంది.

16 మంది సెలెబ్రిటీలు

16 మంది సెలెబ్రిటీలు

ఈ సీజన్ లో ఏమైనా జరగొచ్చు అంటూ బిగ్ బాస్ టీం అంచనాలు పెంచేసింది. ఈ సీజన్లో మొత్తం 16 మంది సెలెబ్రిటీలు కాంటెస్ట్ చేయబోతున్నారు. 70 కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

నాని తొలిసారి

నాని తొలిసారి

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని తొలిసారి బుల్లితెరపైకి రాబోతున్న సందర్భం ఇది. నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ పై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది.

నాకు కూడా క్లారిటీ లేదు

నాకు కూడా క్లారిటీ లేదు

తొలి సీజన్ లో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని నాని ప్రశంసించాడు. ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఎలా చేశానో నాకే క్లారిటీ లేదు. అందరిలాగే నేను కూడా జూన్ 10 నుంచి తెసులుకుంటా అని నాని తెలిపాడు.

మూడున్నర నెలలు మీ ఇంట్లో

మూడున్నర నెలలు మీ ఇంట్లో

తనని ఎవరు చూసినా మా ఇంట్లో అబ్బాయిలా ఉన్నావని అంటారు. బిగ్ బాస్ 2 ద్వారా మూడున్నర నెలలు మీ ఇంట్లోనే ఉండబోతున్నా అంటూ నాని తెలిపాడు.

నేను కరెక్టేనా

నేను కరెక్టేనా

మొదట ఈ షో చేయమని బిగ్ బాస్ టీం తనని సంప్రదించగానే మొదట తనకే డౌట్ వచ్చిందని నాని తెలిపాడు. నేను ఈ షోకి కరెక్టేనా, చేయగలనా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ తనకు బిగ్ బాస్ టీం కాన్ఫిడెన్స్ ఇచ్చిందని నాని తెలిపాడు.

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం చాలా కష్టం. ఏళ్లతరబడి మాట్లాడుకుంటున్న సినిమా స్థాయిని మించేలా మార్నింగ్ షో లోనే ఆకట్టుకోవాలని నాని తెలిపాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలి సీజన్ అలాంటిదే అని తెలిపాడు. కానీ తొలి సీజన్ కు మించి ఉండేలా ప్రయత్నించామని నాని తెలిపాడు.

ఎన్టీఆర్ తప్పుకుంది అందుకే

ఎన్టీఆర్ తప్పుకుంది అందుకే

తొలి సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ రెండవ సీజన్ నుంచి తప్పుకోవడానికి కారణం ఉందని బిగ్ బాస్ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా డేట్స్ సర్దుబాటు కాలేదని అందువలనే తప్పుకున్నారని తెలిపారు.

ఏమైనా జరగొచ్చు

ఏమైనా జరగొచ్చు

సీజన్ 2 లో ఏమైనా జరగొచ్చని నాని అంచనాలు పెంచేశాడు. కంటెస్టెంట్స్ కి విధించబోయే పరీక్షలు కఠినంగా ఉంటాయని తెలిపాడు. ప్రతి రోజు ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఉంటుందని నాని తెలిపాడు.

నా కొడుకుతో ఆడుకునే అవకాశం

నా కొడుకుతో ఆడుకునే అవకాశం

గత సీజన్ ని ముంబై లో షూట్ చేశారు. అలా చేయడం ఇబ్బందే. కానీ ఈ సీజన్ ని హైదరాబాద్ లోనే షూట్ చేయడం వలన నా కొడుకుతో ఆడుకునే అవకాశం దొరికిందని నాని తెలిపాడు. ఈ షో కోసం తన స్నేహితులెవరిని తాను రెకమండ్ చేయలేదని నాని తెలిపాడు.

ఒప్పుకోవడానికి కారణం అదే

ఒప్పుకోవడానికి కారణం అదే

బిగ్ బాస్ షో ఒప్పుకోవడానికి కారణం ఛాలెంజ్ అని నాని తెలిపాడు.బిగ్ బాస్ షో ఇప్పటికే ఎంత క్రేజ్ సంపాదించింది తెలిసిందే. అలాంటి షోని తాను చేయగలనా లేదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఆ ఛాలెంజ్ ని స్వీకరించానని నాని తెలిపాడు.

ఆయన్నికొట్టేవారు లేరు

ఆయన్నికొట్టేవారు లేరు

హోస్టింగ్ విషయంలో అమితాబ్ బచ్చన్ ని కొట్టేవారు ఇండియాలోనే లేరని నాని తెలిపాడు. బిగ్ బాస్ షో హోస్టింగ్ విషయంలో తాను ఎవరి దగ్గర నుంచి సూచనలు తీసుకోలేదని, సహజసిధ్ధంగా చేయడానికి ప్రయత్నించానని నాని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X