బిగ్ బాస్ 2 తెలుగు: హీరో తరుణ్, సింగర్ గీతా మాధురి... ఇంకా ఎవరంటే?

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants List! Hero Tarun, Geetha Madhuri

తెలుగు టెలివిజన్ చరిత్రలో సంచలన రేటింగ్స్ నమోదు చేసి తొలి సీజన్లోనే ఎంతో మందికి ఫేవరెట్ షోగా మారింది 'బిగ్ బాస్ తెలుగు' రియాల్టీ షో. గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రెండో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా? అని బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటీవల ఈ షోకు సంబంధించిన వివరాలు ప్రకటించడంతో పాటు లోగో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరు? హోస్ట్ ఎవరు? అనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి.

షో హోస్ట్‌గా హీరో నాని ఖరారు

షో హోస్ట్‌గా హీరో నాని ఖరారు

సినిమాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజీ కావడం వల్ల రెండో సీజన్‌కు మరో హీరోను నిర్వాహకులు ఫైనల్ చేశారు. అతడు మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. తన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయగల టాలెంట్ నాని సొంతం. దీంతో పాటు నాని ఫాంలో ఉన్న హీరో. అందుకే నానిని ఈ షో హోస్ట్ చేయడానికి ఒప్పించారు నిర్వాహకులు. కొన్ని రోజుల్లో నానితో బిగ్ బాస్ 2 తెలుగు ప్రోమో విడుదల చేసి ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.

ఈ సారి షోలో స్పెషల్ ఎట్రాక్షన్ హీరో తరుణ్

ఈ సారి షోలో స్పెషల్ ఎట్రాక్షన్ హీరో తరుణ్

గత సీజన్లో హీరో నవదీప్ బాగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని సందడి చేశారు. ఈ సారి టాలీవుడ్లో లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్ ఈ షోలో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు.

హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ

హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ

ఇక టాలీవుడ్లో తన సెక్సీ అప్పియరెన్స్‌తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

సింగర్ గీతా మాధురి

సింగర్ గీతా మాధురి

టాలీవుడ్లో యంగ్ జనరేషన్ సింగర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు గీతా మాధురి. ఈ సారి గీతా మాధురి ఈ షోలో హైలెట్ కాబోతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ 2 సెట్

అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ 2 సెట్

బిగ్ బాస్ మొదటి సీజన్ సెట్ ముంబై సమీపంలోని లోనావాలో వేశారు. అయితే ఈ సారి షో మోస్ట్ తో పాటు, కంటెస్టెంట్స్ ఇబ్బంది పడకుండా హైదరాబాద్‌లోనే అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే సెట్ చేశారు.

వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం

వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం

జూన్ నెల నుండి బిగ్ బాస్ 2కు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లోగో రిలీజ్ చేయడం ద్వారా ఆల్రెడీ స్టార్ మా టీవీలో ప్రమోషన్స్ మొదలయ్యాయి.

పూర్తిగా కొత్త లుక్‌తో బిగ్ బాస్ సీజన్ 2

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదటి దానికంటే పూర్తిగా భిన్నమైన లుక్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. షోకు సంబంధించి టైటిల్‌లోగో, బిగ్ బాస్ హౌస్ ప్రతి అంశంలో పూర్తిగా మార్పులు చేశారు.

సామాన్యులకు ఈ సారి షోలో అవకాశం

బిగ్ బాస్‌ 2లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. సామాన్య ప్రజలు మే 15 వరకు తమ ఎంట్రీలు పంపించవచ్చు. మీ అదృష్టం బావుంటే మీరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కించుకోవచ్చు. ఇందుకోసం biggbosstelugu.startv.com వెబ్ సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X