Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పెళ్లాన్ని గెలికావు.. అలానే చేస్తావా? వరుణ్ సందేశ్, మహేష్ విట్టా ఫైట్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3లో సెలబ్రిటీల మధ్య విబేధాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. ఒకరంటే మరొకరికి పడనంతగా అభిప్రాయ బేధాలు భగ్గుమన్నాయి. నాలుగో రోజు కార్యక్రమంలో హేమ, రాహుల్, హేమ-శ్రీముఖి మధ్య, అలాగే వరుణ్ సందేశ్ దంపతులు రాహుల్ విట్ట మధ్య గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. వారి మధ్య గొడవలకు కారణమేమిటంటే..
ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ
లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా హేమ, రాహుల్ మధ్య గొడవ జరిగిన తర్వాత ఇంటి సభ్యులు సముదాయించడంతో ఇళ్లంతా ప్రశాంతంగా కనిపించింది. ఇక లాన్లో చేరిన శ్రీముఖి, బాబా భాస్కర్, హేమ, జాఫర్, మహేష్ విట్ట ఆటవిడుపుగా బాహుబలి స్కూప్ చేశారు. ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ నటించారు. హేమ, జాఫర్ మధ్య జరిగిన సంభాషణ ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.
పైజామా పార్టీ అంటూ లేడీస్ సెల్ఫీ
ఇక ఇంటిలోని లేడీ సెలబ్రిటీలు హంగామా చేశారు. పైజామా పార్టీ అంటూ సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. అందరం పైజామాలు వేసుకొని ట్రెండ్ క్రియేట్ చేశాం అని బిగ్‌బాస్‌కు చెబుతూ ఇంటిలోని కెమెరాలకు ఫోజులిచ్చారు. బిగ్‌బాస్ కెమెరా ముందు అందరూ కలిసి సెల్ఫీ దిగారు.
మహేష్ విట్ట.. వరుణ్ సందేశ్ మధ్య
బడ్జెట్ టాస్క్ తర్వాత అంతా ప్రశాంతమే అనుకొన్న సమయంలో మహేష్ విట్ట, వరుణ్ సందేశ్ మధ్య భారీగా గొడవ జరిగింది. వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు విషయంలో మాటలు చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. మహేష్ విట్టపై వరుణ్ సందేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య సముదాయించినప్పటికీ వరుణ్ కోపంతో మహేష్‌పైకి దూకినంత పనిచేశాడు.
నీ సంగతి చూస్తా... నన్ను కొట్టి చెప్పు అంటూ
మహేష్, వరుణ్ సందేశ్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగింది. నా భార్యతో అగౌరవంగా ప్రవర్తిస్తావా? అసలు నీకు ఏం తెలుసు? ఆడవాళ్లతో మాట్లాడే పద్దతి ఇదేనా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. నన్నుకొట్టి సారు చెప్పు. నీ సంగతి చూస్తా అంటూ ఊగిపోయాడు. ఇంటి సభ్యుల జోక్యంతో కాస్త గొడవ దారికి వచ్చినట్టు కనిపించింది. అయితే అంతటి ఆగకుండా ఐదోరోజు కూడా గొడవ తీవ్రస్థాయిలో జరిగిందనే సూచనలు కనిపించాయి.