బిగ్ బాస్: ఒకరిపై ఒకరు రచ్చ రచ్చ.. కనీసం గుడ్డుకూడా కాపాడుకోలేవా అంటూ వరుణ్ పై వితిక పంచ్
Recommended Video
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. జులై నెలాఖరులో ప్రారంభమైన ఈ షో తొలిరోజు నుంచే ఆసక్తికరంగా మారింది. హోస్ట్‌గా నాగార్జున మెప్పిస్తుండగా, సరదా సరదా ఫీట్స్ తో కంటిస్టెంట్లు ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు ఫినిష్ చేయడంలో భాగంగా కంటిస్టెంట్లు పడుతున్న తంటాలు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా నిన్న (మంగళవారం) జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటిస్టెంట్ల నడుమ జరిగిన టాస్క్ మరింత ఆసక్తికరంగా సాగింది. వివరాల్లోకి పోతే..

లగ్జరీ బడ్జెట్ టాస్క్..
మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో కంటిస్టెంట్లకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇంట్లోని కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించిన బిగ్ బాస్ వాళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన టాస్క్ అలాట్ చేశాడు. ఒక జట్టుకి శ్రీముఖి లీడర్‌గా, మరో జట్టుకి హిమజను లీడర్ గా నియమించాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటం ఆసక్తికరంగా సాగింది.

గుడ్ల కోసం కొట్లాట
రెండు జట్లకు వేర్వేరుగా బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి, రెడ్ టీంకి శ్రీముఖి లీడర్‌గా పెట్టి, బ్లూ టీంకి హిమజను లీడర్‌గా నియమించాడు బిగ్ బాస్. ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. అలాగే ఈ గేమ్‌లో ఎక్కువ గుడ్లు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటూ గేమ్ మొదలు పెట్టించారు బిగ్ బాస్.

ఒకరిపై ఒకరు పడుతూ రచ్చ రచ్చ
ఈ టాస్క్‌లో భాగంగా జెండాల కోసం, గుడ్ల కోసం ఒకరిపై ఒకరు పడుతూ లాక్కుంటూ, పీక్కుంటూ కొట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు హౌస్‌మేట్స్. యాక్షన్ ఫీట్లు, ఫైట్లు చేస్తూ పోటీపడ్డారు. ఇందులో భాగంగా కనిపించిన సీన్స్ అబ్బో అనిపించాయి. మహిళా కంటెస్టెంట్స్‌ను నలిపిపడేశారు మేల్ కంటెస్టెంట్స్. హౌస్ మేట్స్ గోలతో హౌస్ అంతా సందడి సందడిగా కనిపించింది.

వరుణ్ పై వితిక కామెంట్
ఇక ఈ గేమ్‌లో వరుణ్ సందేశ్ దగ్గర నుండి సాఫ్ట్ గేమ్ ఆడి ఈజీగా గుడ్డును దొంగలించడంతో వరుణ్ పై హాట్ కామెంట్ చేసింది ఆయన భార్య వితిక. నువ్.. పెద్ద ఫ్రూట్‌వి గుడ్డుకూడా కాపాడుకోలేకపోయావు అంటూ పంచ్ డైలాగ్ విసిరి షాకిచ్చింది వితిక. దీంతో ఈ గేమ్ లో వితిక విసిరినా ఈ డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

ఎవరి పాట్లు వారివి
మొదటి మూడు వారాల్లో వరుసగా హేమ, జాఫర్, తమన్నా ఎలిమినేట్ కాగా నాలుగోవారం ఎలిమినేషన్‌కి ఏకంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ లిస్ట్ నుంచి తమ పేరును తొలగించుకోవడంలో భాగంగా నానా తంటాలు పడుతున్నారు కంటిస్టెంట్స్.


Click it and Unblock the Notifications











