అశురెడ్డికి శ్రీముఖి కౌంటర్.. బెడ్ రూమ్‌లో ఏడ్చేసిన రవికృష్ణ.. క్షమాపణ చెప్పక తప్పలేదు

వివాదాల నడుమ మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌మేట్స్ ఫన్నీ టాస్క్ లు, వారి మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలు బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాయి. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా షో మాత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. కారణం ఇంట్లో జరిగే రచ్చ రచ్చ. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ టాస్క్ జరిగినా కూడా శ్రీముఖి హైలైట్ అవుతోంది. నిన్న (బుధవారం) జరిగిన 25 వ ఎపిసోడ్ లోను శ్రీముఖి హైలైట్ అయింది. ఆ వివరాలు చూస్తే..

నేనే రాజు నేనే మంత్రి టాస్క్

నేనే రాజు నేనే మంత్రి టాస్క్

గత ఎపిసోడ్ లో విక్రమ పురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా ఏర్పడి కోడిగుడ్ల టాస్క్ తో రచ్చ రచ్చ చేసిన హౌస్‌మేట్స్.. ఈ ఎపిసోడ్‌లో మరో టాస్క్‌తో ఆకట్టుకున్నారు. నిన్నటి టాస్క్‌కి కొనసాగింపుగా లెవెల్ 2 టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ‘నేనే రాజు నేనే మంత్రి' పేరుతో ఇవ్వబడిన ఈ టాస్క్ అత్యంత ఆసక్తికరంగా సాగింది.

గార్డెన్ లో సింహాసనం.. అలీ రెజా గెలుపు

గార్డెన్ లో సింహాసనం.. అలీ రెజా గెలుపు

హౌస్ లోని గార్డెన్‌లో ఓ సింహాసనాన్ని ఉంచి దాని కోసం పోటీపడటానికి ఇద్దరు డ్రాగన్లను ఎంపిక చేశారు బిగ్ బాస్. ఆ ఇద్దరే అలీ రెజా, రాహుల్. ఈ ఇద్దరిలో ఎవరు సింహాసనం అధిష్టిస్తే వారే కెప్టెన్ అవుతారు అనేది నియమం. బజర్ మోగిన వెంటనే సింహాసనం ఎక్కడానికి ఈ ఇద్దరు పోటీపడాలి. వారు సింహాసనం ఎక్కే సమయంలో మిగిలిన హౌస్‌మేట్స్ తమకు ఇష్టమైన వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు. ఇష్టం లేని వ్యక్తిని కిందికి లాగొచ్చు. ఈ ఆసక్తికర టాస్క్ లో చివరకు అలీ రెజా విన్ అయి కెప్టెన్ అయ్యాడు.

బెడ్ రూమ్‌లో రవికృష్ణ ఏడుపు

బెడ్ రూమ్‌లో రవికృష్ణ ఏడుపు

ఆ వెంటనే బెడ్ రూమ్ వెళ్లి రవికృష్ణ ఏడ్చేశాడు. అయితే అతను ఎందుకు ఏడ్చాడనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. మిగిలిన హౌస్‌మేట్స్ మాత్రం రవికృష్ణ కంటతడి పెట్టుకోవడానికి కారణం అలీనే అని, అలీ కెప్టెన్ కావడం వల్ల రవికృష్ణ కార్చిన ఆనందభాష్పాలు అవి అన్నారు.

ఎలిమినేషన్ విషయంలో శ్రీముఖి

ఎలిమినేషన్ విషయంలో శ్రీముఖి

ఇక మరోవైపు శ్రీముఖి, రోహిణి మధ్య ఎలిమినేషన్ విషయంలో ఒకింత వాదన జరిగింది. ఈవారం నువ్వు వెళ్లిపోతావే.. అంటూ రోహిణి మొహం మీదనే శ్రీముఖి చెప్పేయడంతో ఆమె బాధ పడింది. ఈ విషయమై రోహిణిని మిగిలిన హౌస్ మేట్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. శ్రీముఖి తీరుపై అశురెడ్డి, వితికా షేరు కోపం వ్యక్తం చేశారు.

అశురెడ్డికి శ్రీముఖి కౌంటర్

అశురెడ్డికి శ్రీముఖి కౌంటర్

రోహిణి బాధ చూసి కోపంతో అశురెడ్డి వెళ్లి శ్రీముఖిని ప్రశ్నించింది. 'దాన్ని మొహం మీదే నువ్వు ఎలిమినేట్ అయిపోతావ్ అంటే అది బాధ పడుతుంది' అని అడిగింది. దానికి బదులిచ్చింది శ్రీముఖి 'రోహిణి, నేను ఫ్రెండ్స్. దాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలుసు. మేమిద్దం చూసుకుంటాం. మధ్యలో మీరు కలుగజేసుకోవద్దు' అంటూ కౌంటర్ వేసింది. చివరకు రోహిణికి శ్రీముఖి క్షమాపణ చెప్పింది. ఇవన్నీ గత ఎపిసోడ్‌లో బాగా హైలైట్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X