పడుకొని రొమాంటిక్ ముచ్చట్లలో రాహుల్, పునర్నవి.. వరుణ్ హగ్.. బిగ్ బాస్ సీరియస్
జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగిపోతోంది. కంటిస్టెంట్ల నడుమ గొడవలు, రొమాంటిక్ ముచ్చట్లు, ఆశ్చర్య పరిచే పరిణామాలు, ఆసక్తి కలిగించే టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా నిన్నటితో (శనివారం) 27 వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఈ ఎపిసోడ్ హైలైట్ అయిన కొన్ని సంగతులు మీ కోసం..

బిగ్ బాస్ బ్యూటీలతో బాబా భాస్కర్.. నాగార్జున ఎంట్రీ
శనివారం ఎపిసోడ్ చాలా కలర్ ఫుల్‌గా ప్రారంభమైంది. మోడల్స్‌తో స్టెప్పులేస్తూ అదరగొట్టేలా ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న సంగతులను చూపించారు. ఎపిసోడ్ లో భాగంగా బాబా భాస్కర్, పునర్నవి, రాహుల్‌కి చురకలంటిచారు నాగ్. ఇక నలుగురు బిగ్ బాస్ బ్యూటీలతో బాబా భాస్కర్ వేసిన స్టెప్పులు బుల్లితెర ఆడియన్స్ లో జోష్ నింపాయి.

సోఫాలో పడుకొని రొమాంటిక్ ముచ్చట్లు
బిగ్ బాస్ హౌస్ లోని హాల్‌లో ఉన్న సోఫాలో అటు ఇటుగా పడుకుని రొమాంటిక్ ముచ్చట్లు పెడుతూ కనిపించారు రాహుల్, పునర్నవిలు. ఈ నేపథ్యంలో సోఫా నుంచి సడెన్‌గా రాహుల్ లేచి.. మనం ఇలా పడుకుంటే ట్రోల్ పడుకొని కనిపిస్తే ట్రోల్స్ బారిన పడతాం అన్నాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన పునర్నవి..
నేనక్కడ పడుకుంటే నువ్వే పిలిచావ్ అంటూ సీరియస్‌గా మాట్లాడింది.

పునర్నవి, వితికాల మధ్య రచ్చ.. వరుణ్ హగ్
ఇక కిచెన్ టీంలో ఉన్న పునర్నవి, వితికా షేరుల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. చిన్నగా గొడవ కావడంతో పునర్నవి అలిగి వెళ్లిపోయింది. దీంతో మధ్యలో కల్పించుకున్న వరుణ్ సందేశ్, వితికాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగాక వితికకు ఓ హగ్ ఇచ్చి కూల్ చేశాడు వరుణ్.

హౌస్‌మేట్స్‌కి అవార్డ్స్
ఇక పోతే హౌస్‌లో గత నాలుగు వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయాన్ని పూర్తిగా గమనించిన బిగ్ బాస్ నాగార్జున.. వాళ్లకు ప్రవర్తనకి తగిన అవార్డ్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాబా భాస్కర్.. బెస్ట్ కుక్కర్‌గా, పునర్నవి.. బెస్ట్ అంపైర్‌గా, బిగ్ మౌత్ రాహుల్, బెస్ట్ బూతద్దం వితికా షేరు, బెస్ట్ బనానా అషు రెడ్డి, బుల్లలు పెట్టే అవార్డు మహేష్ విట్టా, బెస్ట్ ఆనియన్ కట్టర్ శివజ్యోతి, లౌడ్ స్పీకర్ శ్రీముఖి, బెస్ట్ ఫ్రూట్ వరుణ్ సందేశ్, బెస్ట్ ఇయర్ రవిక్రిష్ణ, బెస్ట్ కత్తెర రోహిణి.. వివిధ కేటగిరీల్లో అవార్డులకు ఎంపికయ్యారు.

రాహుల్‌పై బిగ్ బాస్ సీరియస్
హౌస్‌లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న రాహుల్‌పై బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ‘ముందు నువ్ నీలా ఉండు.. మాస్క్ వేసుకున్నట్టుగా ప్రవర్తించకు. శ్రీముఖి విషయంలో నువ్ మాస్క్ వేసుకుని ఆమె ముందు ఒకలా వేరే వాళ్ల ముందు ఒకలా ప్రవర్తించకు. పాట ఎలా పాడతావో.. ఆట కూడా అలానే ఆడు' అంటూ రాహుల్ కి చురకలంటించారు నాగార్జున.

ఇద్దరు సేఫ్.. ఇక ఆ అయిదుగురిలోనే
ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడుగురిలో శివజ్యోతి, వరుణ్ సందేశ్‌లు సేఫ్ అయినట్టు తెలిపారు బిగ్ బాస్. ఇక మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ముగియాల్సిందే.


Click it and Unblock the Notifications











