శ్రీముఖి వెన్నుపోటుదారు వితిక.. బెడ్‌పై వరుణ్‌తో.. చిచ్చు పెట్టిన బిగ్ బాస్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రోజు రోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, మనస్తాపాలు, సరదాలు ఇవన్నీ బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాగార్జున ఎంట్రీతో ఎపిసోడ్ 35 రసవత్తరంగా సాగింది. ఆ విశేషాలు చూద్దామా..

వితిక ఏడుపు, రవికృష్ణ ఓదార్పు
షో ప్రారంభం కాగానే బిగ్ బాస్ హౌస్ విశేషాలను మన టీవీ ద్వారా చూపించారు నాగార్జున. అక్కడ జరిగిన ఆసక్తికర పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. నా మొగున్ని అంటారా? అంటూ వితిక ఏడుపు, రవికృష్ణ ఓదార్పు.. అలాగే బిగ్ బాస్ హౌస్‌లో వాటర్ లేక శివజ్యోతి కన్నీళ్లు, ఈగ మరణంతో హౌస్‌మేట్స్ ఓవరాక్షన్ లాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇక బెడ్‌పై వితికాతో వరుణ్ సరదాలు ఎలాగూ ఉండేవే కదా!.

వెన్నుపోటు రాజకీయం.. చిచ్చుపెట్టిన బిగ్ బాస్
ఇక ప్రతీ వారం లాగే ఈ వారం హౌస్‌మేట్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చి చిచ్చు పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ ద్వారా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎవరికి శత్రువు? ఎవరు ఎవరికి మిత్రుడు? ఎవరు ఎవరికి వెన్నుపోటుదారు? తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఒక బోర్డ్ ఇచ్చి ఆ బోర్డుపై మీరనుకున్న వారి ఫొటోలను పెట్టి శత్రువా? మిత్రుడా? లేక వెన్నెపోటు దారుడా? కారణం చెప్పాలని కోరారు నాగార్జున.

హౌస్‌మేట్స్ రిపోర్ట్స్ ఇలా ఇచ్చారు
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడంలో భాగంగా హౌస్‌మేట్స్ ఈ రకంగా రిపోర్ట్స్ ఇచ్చారు.
హిమజ: శ్రీముఖి (మిత్రుడు), వితికా (శత్రువు), అషురెడ్డి (వెన్నుపోటు)
పునర్నవి: రాహుల్ (మిత్రుడు), శత్రువు (వరుణ్ సందేశ్), వితికా (వెన్నుపోటు)
శ్రీముఖి: రాహుల్ (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), వితికా, పునర్నవి (వెన్నుపోటు)
వితిక: పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు)
మహేష్ విట్టా: బాబా భాస్కర్ (మిత్రుడు), అలీ రజా (శత్రువు), వెన్నుపోటు (శ్రీముఖి)
అషురెడ్డి: శివజ్యోతి (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), హిమజ (వెన్నుపోటు)
అలీ రాజా: శివజ్యోతి (మిత్రుడు), రవిక్రిష్ణ (శత్రువు), హిమజ (వెన్నుపోటు)
రాహుల్: పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు)
వరుణ్ సందేశ్: మహేష్ (మిత్రుడు), వితికా (శత్రువు), పునర్నవి (వెన్నుపోటు)
శివజ్యోతి: అషు (మిత్రుడు), మహేష్ (శత్రువు), బాబా భాస్కర్ (వెన్నుపోటు)
బాబా భాస్కర్: శ్రీముఖి (మిత్రుడు), అలీ, మహేష్ (వెన్నుపోటు). శత్రువు ఎవరూ లేనన్నారు బాబా.
రవిక్రిష్ణ: శివజ్యోతి (మిత్రుడు), అలీ (శత్రువు), వితికా (వెన్నుపోటు)

బయటపడిన శివజ్యోతి, మహేష్ విట్టా
ఎలిమినేషన్ విషయానికొస్తే ఈ వారం అషు రెడ్డి, మహేష్ విట్టా, రాహుల్, హిమజ, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ ఏడుగురిలో శివజ్యోతి, మహేష్ విట్టా సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











