అలీకి సైట్ కొట్టిన శ్రీముఖి.. అతను కూడా సై.. ట్రైన్‌లో ఓ రేంజ్ రొమాన్స్

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 39 Highlights || Filmibeat Telugu

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' రోజు రోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎవ్వరు ఊహించని టాస్క్‌లు షో రసవత్తరంగా నడిపిస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకోవడం గమనించవచ్చు. అలా అలా బుధవారం నాటితో 39 వ ఎపిసోడ్‌ కూడా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. అయితే ఈ ఎపిసోడ్‌లో ఇచ్చిన టాస్క్ బుల్లితెర ఆడియన్స్‌కి ఓ కొత్త టేస్ట్ రుచి చూపించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

చలో ఇండియా.. మరింత ఫన్నీగా

చలో ఇండియా.. మరింత ఫన్నీగా

బిగ్ బాస్ కంటిస్టెంట్ల నడుమ ఏ మాత్రం సమన్వయం లోపించకూడదనే ఉదేశ్యంతో రరకాల ఫన్నీ టాస్కులు క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఈ మేరకు నిన్నటి (బుధవారం) ఎపిసోడ్ లో ఛలో ఇండియా అంటూ సరికొత్త టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్‌‌మేట్స్ అంతా కలిసి హౌస్‌లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్‌లో ఇండియాలోని వివిధ ప్రాంతాలను చుట్టిరావడమనేది ఈ టాస్క్ కాన్సెప్ట్. ఇందులో భాగంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

బిగ్ బాస్‌ హౌస్‌లో కొత్త జంట

బిగ్ బాస్‌ హౌస్‌లో కొత్త జంట

ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి - రవిని హానీమూన్ కపుల్స్ చేశాడు బిగ్ బాస్. కొత్తగా పెళ్ళైన వీళ్లిద్దరూ హనీమూన్ కోసం ట్రైన్‌లో ప్రయాణించి.. ఆ క్యారెక్టర్లలో పూర్తిగా లీనమయ్యారు. ఈ ట్రైన్ డ్రైవర్లుగా రాహుల్, వరుణ్ ఉన్నారు. అలాగే ఇదే ట్రైన్‌లో టీ, స్నాక్స్ అమ్మే వ్యక్తిగా బాబా భాస్కర్ ని నియమించాడు బిగ్ బాస్ చెప్పాడు. టూర్ మేనేజర్ అలీ ఉన్నాడు. ఇక మిగిలిన శ్రీముఖి, శివజ్యోతి, వితికా, మహేష్, హిమజ ట్రైన్‌లో ప్రయాణికులుగా ఉన్నారు.

కొత్త జంట అంటే ఇదే అన్నట్లుగా పునర్నవి - రవి రొమాన్స్

కొత్త జంట అంటే ఇదే అన్నట్లుగా పునర్నవి - రవి రొమాన్స్

ఇంటినుండి పారిపోయి పెళ్లి చేసుకున్న కొత్త జంటగా పునర్నవి - రవి జీవించేశారు. ఈ జర్నీ వారిని హనీమూన్ ట్రిప్ కావడంతో ఆ ఇద్దరి రొమాన్స్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. నిజమైన కొత్త జంట కూడా ఇంతలా రొమాంటిక్ మూడ్ లో మునిగిపోదేమో! అలా రెచ్చిపోయారు పునర్నవి - రవి. వీళ్ళను చూస్తే మోడ్రెన్ కొత్త జంట అంటే ఇదే అన్నట్లుగా అనిపించింది.

మేనేజర్‌కి శ్రీముఖి సైట్ కొట్టేస్తూ

మేనేజర్‌కి శ్రీముఖి సైట్ కొట్టేస్తూ

ఇక ట్రైన్‌లో అందమైన అమ్మాయిగా శ్రీముఖి సైట్ కొట్టడం మరింత ఆసక్తి రేకెత్తించింది. పొట్టి నిక్కరు వేసుకొని ఎక్స్‌పోజింగ్ చేస్తూ టూర్ మేనేజర్ అలీకి సైట్ కొడుతూ ఆ క్యారెక్టర్‌లో అలా ఒదిగిపోయింది శ్రీ ముఖి. ఓర చూపులు చూడటం, సిగ్గు పడుతూ అలీని లైన్ లోకి తీసుకొచ్చేనందుకు శ్రీ ముఖి మామూలు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేదండీ బాబు!. దీంతో అలీ, శ్రీ ముఖితో రొమాన్స్ కి రెడీ అన్నాడు.

గడుసరి భార్య.. అమాయక భర్త

గడుసరి భార్య.. అమాయక భర్త

అమాయకుడైన భర్తగా మహేష్, గడుసరి భార్యగా హిమజ కూడా ఆకట్టుకున్నారు. మొత్తానికి రసవత్తరంగా సాగిన ఈ ట్రైన్ జర్నీ 40 వ ఎపిసోడ్ లో కూడా సాగిపోనుంది. చూడాలి మరి ఆ ఆసక్తికర టాస్క్ లతో ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X