ఏడుపులతో గొల్లుమన్న బిగ్‌బాస్.. షో నుంచి టాప్ సెలబ్రిటీ అలీరెజా అవుట్, నాని ఎంట్రీతో
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 3' విజయవంతంగా రన్ అవుతూ ప్రస్తుతం 7వ వారం పూర్తిచేసుకుంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తికి తెరపడింది. ఆడియన్స్ సహా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ షాకిస్తూ ఈ వారం ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరో ప్రకటించారు నాగార్జున. దీంతో ఎప్పుడూ అల్లరల్లరిగా ఉండే బిగ్‌బాస్ హౌస్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. పూర్తి వివరాలు చూద్దామా..

ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్
ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ అలీ రెజా, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, శ్రీముఖి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ శనివారమే సేఫ్ జోన్‌లో పడ్డాడు. ఇక మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా చూసిన వారందరినీ ఆదివారం ఎపిసోడ్ ఆశ్చర్యపర్చింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి అలీ రాజాను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు నాగార్జున.

తొలిసారి నామినేట్ అయ్యాడు.. అప్పుడే
ఈ సీజన్‌లో నామినేషన్ లిస్ట్‌లో అలీ రాజా పేరు ఉండటం ఇదే తొలిసారి. కానీ ఈ ఒక్కసారి నామినేషనే అలీ రాజాను బిగ్‌బాస్ హౌస్ నుంచి వెనక్కి పంపింది. తొలిసారి నామినేట్ అయిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో ఈ సీజన్ లోనే రోహిణి, అషు రెడ్డి, తమన్నా తొలిసారి నామినేట్ అయి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

అలీ రాజా అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి
బిగ్ బాస్ హౌస్‌లో అలీ రెజా, శ్రీముఖి చాలా ఎంత క్లోజ్‌గా ఉండేవారో తెలిసిందే. శ్రీముఖికి అత్యంత నమ్మకస్తుడిగా, అన్ని విషయాల్లోనూ ఆమెకు హెల్ప్ చేస్తూ కనిపించేవాడు అలీ రాజా. అలాంటి వ్యక్తి ఎలిమినేషన్ కావడంతో శ్రీముఖి దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చేసింది.

మిగితా హౌస్‌మేట్స్ పరిస్థితి
అలీ రాజా ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే మిగితా హౌస్‌మేట్స్ పరిస్థితి చూస్తే.. శివజ్యోతి, హిమజ కూడా ఏడ్చేశారు. రవి, వరుణ్ సందేశ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హౌస్‌మేట్స్ అంతా ఎంతో బాధపడుతూ అలీ రాజాను హౌస్ నుంచి పంపించేశారు.


Click it and Unblock the Notifications











