శ్రీముఖికి పంచ్.. రాహుల్ చెప్పిన దానికి పునర్నవి ఓకే.. హగ్గింగ్ ఇంకా!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' విజయవంతంగా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు, హౌస్‌మేట్స్ త్యాగాలు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. నిన్న (మంగళవారం) జరిగిన ఎపిసోడ్‌లో అవే హైలైట్ అయ్యాయి. ఆ వివరాలు చూస్తే..

బిగ్‌బాస్ హౌస్.. అంతా త్యాగాల మయం

బిగ్‌బాస్ హౌస్.. అంతా త్యాగాల మయం

ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడం కోసం బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్‌లు ఇచ్చాడు. దీంతో సోమవారం జరిగిన ఎపిసోడ్‌ అంతా త్యాగాల మయమే అయింది. శ్రీముఖి కోసం బాబా భాస్కర్, పునర్నవి కోసం రాహుల్, శివజ్యోతి కోసం మహేష్, హిమజ కోసం వరుణ్ సందేశ్ చేసిన త్యాగాలు చూశాం. అయితే దాన్నే కంటిన్యూ చేస్తూ మంగళవారం ఎపిసోడ్ లోనూ ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగాలే కనిపించాయి.

 రవికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

రవికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

రవికి బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం నామినేషన్‌ లో ఉన్నావని, శివజ్యోతి తన జుట్టుని షోల్డర్ వరకూ కట్ చేసుకుంటే నువ్ సేవ్ అవుతావని అన్నాడు బిగ్ బాస్. ఈ విషయాన్ని రవి, శివజ్యోతికి చెప్పిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే అనేసి తన జుట్టు కత్తిరించుకుంది. దీంతో రవి సేవ్ అయ్యాడు.

పునర్నవి, రాహుల్‌ ఒకరి కోసం ఒకరు.. తీవ్ర చర్చ

పునర్నవి, రాహుల్‌ ఒకరి కోసం ఒకరు.. తీవ్ర చర్చ

ఇక రాహుల్‌కి మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. నువ్ సేవ్ కావాలంటే పునర్నవి తనను తాను సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవాలని షాక్ ఇచ్చాడు. పునర్నవి, రాహుల్‌ల మధ్య చర్చ జరిగింది. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తన కోసం సీజన్ మొత్తం నామినేట్ కావడానికి సిద్దమైన పునర్నవిని సముదాయించి ఆ డిసీజన్ నుంచి విరమింపజేశారు రాహుల్. దీంతో ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో రాహుల్ పేరు కన్ఫర్మ్ అయింది.

శ్రీముఖికి పంచ్ ఇచ్చిన రాహుల్

శ్రీముఖికి పంచ్ ఇచ్చిన రాహుల్

టెలిఫోన్ బూత్‌ నుండి బయటకు రాగానే.. పున్న ఒక హగ్ ఇవ్వవా ప్లీజ్ అంటూ పునర్నవిని అడిగాడు రాహుల్. దీంతో ఈ ఇద్దరూ కౌగిలింతల్లో మునిగిపోయారు. అయితే శ్రీముఖి ఎంటరై.. ఏంటి? మీ ఇద్దరు ఇంతసేపు ఏం చర్చించుకున్నారు. సినిమా స్క్రిప్ట్ ఏమైనా ఉందా అని అడిగింది. అవును మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోంది అంటూ శ్రీముఖికి పంచ్ ఇచ్చాడు రాహుల్.

వరుణ్ సేవ్ చేస్తే వితిక

వరుణ్ సేవ్ చేస్తే వితిక

ఇక బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉన్న వితికాకు ఒకర్ని నేరుగా నామినేట్ చేయాలని కోరారు బిగ్ బాస్. దీంతో హిమజను నామినేట్ చేసింది వితిక. గత ఎపిసోడ్‌లో పేడలో పడుకుని మరీ హిమజను నామినేషన్ నుండి వరుణ్ సందేశ్ సేవ్ చేస్తే.. మళ్లీ హిమజను ఎలిమినేషన్‌లోకి నెట్టేసింది వితిక.

ఎలిమినేషన్ ఫైనల్

ఎలిమినేషన్ ఫైనల్

మొత్తానికైతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో తొమ్మిదో వారం ఎలిమినేషన్‌ లిస్ట్‌లో మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఈ వారం ఈ ముగ్గురులో ఒకరు బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ కానున్నారు. చూడాలి మరి ఎవరు ఫైనల్‌గా ఎలిమినేట్ అవుతారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X