Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాత్రి లైట్లు ఆఫ్ అయ్యాక వరుణ్, వితిక బెడ్ రూమ్‌లో.. అదట సంగతి.. శివజ్యోతి చెప్పిన సీక్రెట్!
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' విజయవంతంగా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. ఇక బుధవారం ఎపిసోడ్లో గాసిప్ ముచ్చట్లు అబ్బో! అనిపించాయి. ఆ వివరాలు చూద్దామా..
బిగ్ బాస్ హౌస్ సూపర్బ్ పెర్ఫామెన్స్
బిగ్ బాస్ ఇస్తున్న వెరైటీ టాస్క్ లకు రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. తమలోని టాలెంట్ మొత్తాన్ని వెలికి తీస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఓ రకమైన కిక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నాటి ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది.
బయటపడిన టాలెంట్.. ఏడ్చిన శివజ్యోతి
బిగ్ బాస్ కంటిస్టెంట్ బాబా భాస్కర్ హర్ట్ చేశాడని వెక్కివెక్కి ఏడ్చేసింది మరో కంటిస్టెంట్ శివజ్యోతి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా తనలో ఉన్న రెండో యాంగిల్ బయటపెట్టి సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. బిగ్ బాస్ కాలేజ్ అనే టాస్క్ లో శివజ్యోతి మాటలు తన లోని అసలు టాలెంట్ (తీన్మార్ సావిత్రి)ని బయటపెట్టాయి.
వితిక టీజింగ్.. దిమ్మతిరిగేలా శివజ్యోతి
బిగ్ బాస్ కాలేజ్ అనే టాస్క్‌లో క్రేజీ టీజర్‌గా వితికా పెర్ఫార్మ్ చేయగా, స్టూడెంట్స్‌గా శివజ్యోతి పెర్ఫార్మ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ స్పెషల్ కిక్ ఇచ్చింది. స్టూడెంట్ను క్వచ్ఛన్స్ అడిగే ప్రయత్నంలో భాగంగా.. గాసిప్ అంటే ఏంటని శివజ్యోతిని అడిగేసింది వితిక. దీంతో వెంటనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది శివజ్యోతి.
గాసిప్ అంటే ఇదే..
గాసిప్ అంటే అంటూ పుకార్లు అని చెప్పిన శివజ్యోతి.. అక్కడ అన్నీ అటలే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ గాసిప్‌లో మిమ్మల్ని వాడుకుంటా ఏం అనుకోవద్దు అని పేర్కొంటూ.. ''వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ అయ్యాక లోపల ఏమోనట!, వితిక, వరుణ్ని బాగా డబ్బులున్నాయనే పెళ్లి చేసుకుందట'' ఇదే గాసిప్ అంటే అంటూ తనదైన శైలిలో చెప్పింది శివజ్యోతి. దీంతో ఆశ్చర్యపోయిన వితిక తెల్లముఖం వేసింది.
ఎలిమినేషన్ ఫైనల్
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తొమ్మిదో వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఈ వారం ఈ ముగ్గురులో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. చూడాలి మరి ఎవరు ఫైనల్‌గా ఎలిమినేట్ అవుతారనేది.