Bigg Boss 3 Telugu Episode 61 Highlights: మహేష్ విట్టాకు దండలేశారు.. ఇక ఆయన!

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 61 Highlights

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' విజయవంతంగా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. ఇక నిన్న (గురువారం) జరిగిన 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్, జరిగిన సంఘటనలు మరింత ఆసక్తి కలిగించాయి. ఆ వివరాలు చూస్తే..

క్రేజీ టాస్క్‌లు.. షో మరింత ఆసక్తికరం

క్రేజీ టాస్క్‌లు.. షో మరింత ఆసక్తికరం

బిగ్ బాస్ ఇస్తున్న క్రేజీ టాస్క్‌ లతో షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకూ సరికొత్తగా ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక వీటిపై కంటిస్టెంట్స్ చేస్తున్న పర్‌ఫార్‌మెన్స్ బుల్లితెర ఆడియన్స్‌కి వినోదాల విందు ఇస్తోంది. దీంతో ఈ మరింత ఆసక్తికరంగా మారింది.

బాబా భాస్కర్, మహేష్ విట్టా

బాబా భాస్కర్, మహేష్ విట్టా

గత ఎపిసోడ్‌లో కాలేజ్ టాస్క్‌లో భాగంగా బెస్ట్ టీచర్, బెస్ట్ స్టూడెంట్‌లుగా బాబా భాస్కర్, మహేష్ విట్టా ఎన్నికయ్యారు. స్టూడెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో బాబా భాస్కర్‌ను బెస్ట్ టీచర్‌గా ఎన్నుకోగా, టీచర్స్ అయిన వితిక, వరుణ్, బాబా భాస్కర్‌ బెస్ట్ స్టూడెంట్‌గా మహేష్‌ విట్టాని సెలెక్ట్ చేశారు.

కెప్టెన్సీ పోటీ.. ప్రచారం

కెప్టెన్సీ పోటీ.. ప్రచారం

దీంతో బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులుగా బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్‌లుగా ఎన్నికైన బాబా భాస్కర్, మహేష్‌ విట్టా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ‘ప్రచారమే ఆయుధం' అనే టాస్క్ ఇచ్చి ఇద్దరినీ పోటీలోకి దించారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా మహేష్ విట్టా, బాబా భాస్కర్‌లు ఇద్దరు కూడా మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకెళ్లి తమని కెప్టెన్‌గా గెలిపించాలని ప్రచారం చేసుకున్నారు.

మహేష్ విట్టాకు దండలు

మహేష్ విట్టాకు దండలు

ఈ టాస్క్ ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరి ప్రచారం నచ్చితే వారికి.. మిగిలిన కంటెస్టెంట్స్ తమ వద్ద ఉన్న దండను తీసి అతని మెడలో వేయాలి. దీంతో ఎక్కువ దండలు మహేష్ విట్టా మెడ లోనే పడ్డాయి. దీంతో బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు మహేష్ విట్టా.

 ఎక్కువ మంది మహేష్ విట్టాకే..

ఎక్కువ మంది మహేష్ విట్టాకే..

పునర్నవి, హిమజ ఇద్దరూ బాబా భాస్కర్ మెడలో దండ వేయగా.. వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు మహేష్ విట్టా మెడలో దండలు వేశారు. ఈ ఎనిమిది మందిలో ఎక్కువ మంది మహేష్ విట్టాకే దండలు వేయడంతో ‘ప్రచారమే ఆయుధం' టాస్క్‌లో మహేష్ విట్టానే విజయకేతనం ఎగరేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X