సీక్రెట్ రూమ్‌లో పునర్నవితో అలీ.. అందరిలో కంగారు.. బిగ్ బాస్ శిక్ష

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 20 Highlights || Filmibeat Telugu

భారీ ఫాలోయింగ్ ఉన్న 'బిగ్ బాస్' సీజన్ - 3 కొద్దిరోజుల క్రితం ప్రారంభమై విజయవంతంగా సాగుతోంది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఈ షోను మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభించారు నిర్వహకులు. అయితే, బయట రచ్చ కామ్ అయిపోయినప్పటికీ, హౌస్‌లో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి కారణం హౌస్‌మేట్స్ మధ్య పెరుగుతున్న వివాదాలే. బాస్ ఇచ్చే టాస్కులు చేసే క్రమంలో కొందరు సీరియస్ అవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన సభ్యులందరికీ బిగ్ బాస్ శిక్షలు విధించారు. వివరాల్లోకి పోతే..

 సీక్రెట్ రూమ్ టాస్క్.. బిగ్ బాస్ సూచన

సీక్రెట్ రూమ్ టాస్క్.. బిగ్ బాస్ సూచన

ఈ నేపథ్యంలో 19వ ఎపిసోడ్‌లో అలీ, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. వచ్చేవారం ఎలిమినేషన్‌ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ టాస్క్ విజయవంతంగా పూర్తిచేయాలని బిగ్ బాస్ సూచించారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అలీ, పునర్నవి హౌజ్‌లో ఉన్న సీక్రెట్ రూంలోకి వెళ్లారు.

కంగారులో హౌస్‌మేట్స్.. సీక్రెట్ రూమ్‌లో అలీ, పునర్నవి ఎంజాయ్

కంగారులో హౌస్‌మేట్స్.. సీక్రెట్ రూమ్‌లో అలీ, పునర్నవి ఎంజాయ్

అలీ, పునర్నవి కనిపించక పోవడంతో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ ఒకింత కంగారు పడ్డారు. వాళ్ళిద్దరినీ తిరిగి హౌస్ లో చూడాలనుకునే వారికి కొన్ని కండీషన్స్ పెట్టారు బిగ్ బాస్. ఈ మేరకు వారి కోసం హౌస్‌మేట్స్ కొన్ని త్యాగాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవి ఎంజాయ్ చేశారు.

సీక్రెట్ రూమ్‌లో బిగ్ బాస్ టాస్క్

సీక్రెట్ రూమ్‌లో బిగ్ బాస్ టాస్క్

ఇంటి సభ్యులంతా లివింగ్ రూంలోకి రావాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందరూ వచ్చి టీవీ ముందు కూర్చోగానే టీవీలో అలీ, పునర్నవి దర్శనమిచ్చారు. హౌజ్‌మేట్స్ తమను టీవీలో చూస్తున్నట్టు అలీ, పునర్నవికి తెలియదు. ఈ సమయంలో సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ రూంలో చెట్టుకు ఒక డార్ట్ బోర్డు ఉంది. ఆ బోర్డుపై అలీ, పునర్నవి తప్ప మిగిలిన కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్నాయి. వీరందరిలో మీకు నచ్చని ఐదుగురుని ఎంపిక చేసి, దానికి గల కారణం చెప్పాలని వారిద్దరికీ బిగ్ బాస్ ఆర్డర్ వేశారు.

అలీ, పునర్నవి టాస్క్.. కంటిస్టెంట్ల హావభావాలు

అలీ, పునర్నవి టాస్క్.. కంటిస్టెంట్ల హావభావాలు

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడంలో భాగంగా అలీ, పునర్నవి హౌస్‌మేట్స్ పేర్లు చెబుతుంటే కంటిస్టెంట్ల హావభావాలు వర్ణనాతీతం. చివరగా అలీ, పునర్నవిలు సీక్రెట్ టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారని వారిద్దరూ వచ్చేవారం నామినేషన్స్‌లో ఉండరని బిగ్ బాస్ చెప్పారు. ఈ సందర్భంగా సీక్రెట్ రూంను వాళ్ల తరఫున ఇంటి సభ్యులకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు చెప్పారు బిగ్ బాస్. దీంతో హౌస్‌మేట్స్‌ ఈ కొత్త రూంలో కొద్దీ సేపు సరదాగా ఎంజాయ్ చేశారు.

వరుణ్ సందేశ్‌కి శిక్ష.. రూల్స్ బ్రేక్ చేస్తూ

వరుణ్ సందేశ్‌కి శిక్ష.. రూల్స్ బ్రేక్ చేస్తూ

హౌస్ తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన వరుణ్ సందేశ్‌కి శిక్ష వేశారు బిగ్ బాస్. వరుణ్.. తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడని, హౌస్‌లో ఎవరు రూల్స్ పాటించకపోయినా పట్టించుకోవాల్సిన కెప్టెనే రూల్స్ బ్రేక్ చేస్తూ వచ్చాడని బిగ్ బాస్ అన్నారు. అందుకు శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మార్చుతున్నానని చెప్పారు. హౌస్ నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని, అలాగే వారందిరికీ ఫుడ్ సప్లై చేయాల్సి ఉంటుందని ఆదేశించారు బిగ్ బాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X