twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిగ్ బాస్' హౌస్‌లోకి హాట్ బ్యూటీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఆమెనే గనక ఎంటరైతే!

    |

    బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతీ రోజూ ఆసక్తికర టాస్క్‌లతో హుషారుగా నడుస్తోంది. హౌస్‌మేట్స్ గొడవలు, ఏడుపులు హైలైట్ అవుతూ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే వారం దగ్గర పడుతుండటంతో ఈ సారి ఎలిమినేషన్ ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే దానిపై వార్తలు పుట్టుకొస్తున్నాయి.

    15 సెలబ్రిటీలు.. సూపర్ రెస్పాన్స్

    15 సెలబ్రిటీలు.. సూపర్ రెస్పాన్స్

    ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 15 సెలబ్రిటీలు మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీలే కావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. హౌస్‌లోకి వచ్చిన వారంతా తమకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు, ప్రేక్షకుల ఓట్లు పడేలా ప్రత్యేకంగా ఎక్స్‌పర్టులతో కూడిన టీమ్స్ నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్ల మీద సోషల్ మీడియాలో ఆర్మీలు కూడా ఫామ్ కావడం విశేషం.

    తొలివారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ

    తొలివారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ

    ‘బిగ్ బాస్' ఎలిమినేషన్‌కై మొదటి రోజే ఆరుగురు సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది. అయితే, మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పాడు. కాకపోతే ఈ అవకాశం ఐదుగురికే ఉందని చెప్పాడు. ఇందులో భాగంగానే ఐదుగురు సభ్యులు మరో ఐదుగురిని నామినేట్ చేశారు. దీంతో తొలివారం షో నుంచి ఎమినెట్ అయ్యే సెలబ్రిటీ ఎవరనే ఉత్కంఠ నెలకొంది జనాల్లో.

    వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటీ

    వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటీ

    బిగ్ బాస్ పై ఇప్పటికే ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసేలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి రానుందనే వార్త తెగ షికారు చేస్తోంది. ఇప్పటికే గ్లామర్ బ్యూటీలతో కళకళలాడుతున్న బిగ్ బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ తీసుకురావాలనే కోణంలో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్‌ని ఎంటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

    బలయ్యేది ఎవరో మరి!

    బలయ్యేది ఎవరో మరి!

    ఇక ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో రాహుల్, హేమ, వితిక, పునర్నవి, హిమజ, జాఫర్ ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో వేటు ఎవరిపై పడనుంది అనే దాన్ని ఊహించడం కష్టతరంగా మారింది. చూడాలి మరి చివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు ఎవరొస్తారనేది.

    English summary
    Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. The six contestants, who got nominated for eviction on the first day, got a chance to save themselves and Hema is supervising the task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X