మగాడిలా ఆడు.. దమ్ముందా? ఇంట్లో అందరూ దొంగలే.. ఇంట్లో చిచ్చు రేపిన టాస్క్‌లు

బిగ్‌బాస్ హౌస్‌లో 23వ రోజు గేమ్స్, టాస్క్‌లతో గందరగోళంగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య జోరుగా గొడవలు జరిగాయి. సోహైల్, అభిజిత్ మధ్య భారీగా పంచాయితీ జరిగింది. కొన్ని రొమాంటిక్ సీన్లు, ఫన్ సన్నివేశాలు, గొడవలతో ఎపిసోడ్ సాగింది. మార్నింగ్ మస్తీలో దొంగతనం ఎలా చేయడం అనే చర్చ జరిగింది. ఇంకా ఇంట్లో ఏం జరిగిందంటే.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
అఖిల్, స్వాతి, మోనాల్ రొమాంటిక్ టాస్క్

అఖిల్, స్వాతి, మోనాల్ రొమాంటిక్ టాస్క్

23వ రోజు ఎపిసోడ్ ఆరంభంలో అఖిల్ సార్థక్, స్వాతి దీక్షిత్, మోనాల్ గజ్జర్ ముగ్గురు కలిసి రొమాంటిక్‌గా మీటింగ్ పెట్టుకొన్నారు. ఎవరూ లేని ఏదైనా దీవికి వెళ్లి ఒంటరిగా గడపాలి. అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. గిటార్ వాయిస్తూ కాలం గడిపేయాలి అని తన కోరికల చిట్టాను అఖిల్ బయటపెట్టారు. అయితే నీకు గిటార్ వచ్చా అని మోనాల్ అడిగింది. అయితే లేదు నేర్చుకొంటానని అఖిల్ చెబితే.. సరిపోయిందని మోనాల్ వెటాకరం ఆడింది.

సోహైల్ చేసిన దొంగతనం

సోహైల్ చేసిన దొంగతనం

ఆ తర్వాత ఉదయం జరిగిన మార్నింగ్ మస్తీ టాస్క్‌లో దొంగతనం ఎలా చేయవచ్చు అనే విషయంపై ఇంటి సభ్యులు మధ్య చర్చ జరిగింది. సోహైల్ దొంగతనం ఎలా చేశాడో చెప్పాడు. గోవాకు స్నేహితులతో వెళ్లినప్పుడు ఏదైనా షాపుకు వెళ్లి ఒకరు ఓనర్‌తో మాట్లాడుతుంటే కళ్లజోడు పెట్టుకొని మెల్లగా జారుకొనే వాళ్లం అంటూ సోహైల్ తన దొంగతనం గురించి చెప్పారు.

చిచ్చు పెట్టిన ఉక్కు హృదయం టాస్క్

చిచ్చు పెట్టిన ఉక్కు హృదయం టాస్క్


ఉక్కు హృదయం టాస్క్‌లో జరిగిన సంఘటనలు అభిజిత్, సోహైల్ మధ్య వాగ్వాదానికి దారి తీశాయి. ఆ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరిగింది. ఒకరిపై మరొకరు మాటలు రువ్వుకొన్నారు. టాస్క్‌లో ఆడవాళ్లతో గేమ్ ఆడిస్తావు.. మగాడిలా ఆడు అంటూ సోహైల్ అంటే..దానికి అభిజిత్ గట్టిగా జవాబిచ్చాడు. నీ బతుకు ఎంత అంటావా అని నిలదీశాడు. అలా ఇంటిలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు ఇంటి సభ్యులు చొరవ తీసుకొనే ప్రయత్నం చేశారు.

కెప్టెన్సీ టాస్క్‌ కోసం గేమ్

కెప్టెన్సీ టాస్క్‌ కోసం గేమ్

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సిల్వర్ కాయిన్స్ గేమ్ మొదలైంది. ఇంటిపై కప్పు నుంచి కాయిన్ పడితే వాటిని ఏరుకొని జాగ్రత్తగా తమ వద్ద ఉంచుకోవాలి. గేమ్ అయిపోయే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్ ఉంటే వారికి స్పెషల్ ప్రివిలైజ్ ఉంటుంది అని బిగ్‌బాస్ గేమ్ రూల్స్ చెప్పారు. ఒకరి కాయిన్స్ మరొకరు కొట్టేసే ప్రయత్నాలు చేశారు. దివి, అమ్మా రాజశేఖర్ మాస్టర్ తదితరులు ఇతరుల కాయిన్స్ కొట్టేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ గేమ్‌లో సోహైల్ కాస్త దూకుడుగాప్రవర్తించాడు. దొంగల్లా ఆడేది మీరే అంటూ గట్టిగట్టిగా అరిచాడు.

ఇంటి సభ్యులు బిగ్‌బాస్ వార్నింగ్

ఇంటి సభ్యులు బిగ్‌బాస్ వార్నింగ్

ఇంట్లో సిల్వర్ కాయిన్ గేమ్‌లో సభ్యుల మధ్య గొడవ అవుతుండటంతో బిగ్‌బాస్ హెచ్చరించాడు. ఎవరి ఆటను వారే ఆడాలని చెప్పాడు. ఆ తర్వాత కాయిన్స్ జాగ్రత్తగా పెట్టుకొనే పనిలో సభ్యులు ఉన్నారు. ఇంటి సభ్యుల్లో కొందరు ఇతరుల కాయిన్స్ కొట్టేసే పనిలో పడ్డారు. కాయిన్స్ టాస్క్‌లో బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కాయిన్స్‌లో స్పెషల్ కాయిన్ ఉందంటూ చెప్పడం.. ఆ కాయిన్ దొరికితే మెహబూబ్ పడేసుకోవడం ఈ గేమ్‌లో ట్విస్ట్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X