Bigg Boss Unseen అఖిల్‌తోనే ఎందుకు? మేము వెళ్లిపోతే దిక్కెవరు.. మోనాల్‌కు అభిజిత్ షాక్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో మోనాల్, అభిజిత్, అఖిల్ సార్థక్ మధ్య అఫైర్ లాంటి దోబుచూలాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిజిత్‌తో, అఖిల్‌తో మోనాల్ గజ్జర్ ఆడుతున్న ప్రేమాయణం గందరగోళానికి గురిచేస్తున్నది. తమ మధ్ జరుగుతున్న గందరగోళంపై మోనాల్‌తో అర్ధరాత్రి క్లారిటీ తీసుకొనేందుకు చర్చ మొదలుపెట్టారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే..

ఇంట్లో అంతా మన గురించే అంటూ మోనాల్
ఇంట్లో ఏం జరుగుతున్నది? నీవు ఎందుకలా ప్రయత్నిస్తున్నావు? అని అభిజిత్ అంటే.. అంతా మన గురించే మాట్లాడుకొంటున్నారు అని మోనాల్ సమాధానం ఇచ్చింది. మన గురించి అంటే అని అభిజిత్ అడిగితే.. నీ గురించి, నా గురించి, అఖిల్ గురించి అంటూ మోనాల్ చెప్పింది. మన ముగ్గురి గురించి ఇంట్లో బాగా చర్చ జరుగుతున్నది అని అన్నారు.

అఖిల్‌తో నాకు పోటీనా?
అభిజిత్‌తో ఇలానే సంభాషణను కొనసాగిస్తూనే నీవు అఖిల్‌తో ఎందుకు మాట్లాడటం లేదు. నాతో మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతున్నావా? అతడిని చూసి ఈర్ష పడుతున్నావా? అని మోనాల్ అడిగింది. అందుకు సమాధానంగా నా కంటే చిన్నోడితోని.. అదీ 25 ఏళ్ల వాడితో నాకు పోటీనా అని అభిజిత్ అన్నారు. అఖిల్ చాలా చిన్న పిల్లాడు.. మంచి వాడు.. నాతో ఎక్కువగా ఉంటాడు అని మోనాల్ చెప్పింది.

అఖిల్‌తోనే ఎందుకు క్లోజ్
అఖిల్‌తోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నావు.. రోజంతా మీరిద్దరే కలిసి ఉంటున్నారు. వేరే వాళ్లు ఉన్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు అని అభిజిత్ గట్టిగా ఇచ్చాడు. అందుకు నీతో మాట్లాడుతున్నాను కదా అని మోనాల్ బదులిచ్చింది. అందుక సమాధానంగా నేను మూడు రోజుల నుంచి మాట్లాడటం లేదుగా అని అభిజ్ చెప్పాడు.

అందరితో కలిసిపో.. ఒక్కరితో వద్దు
మోనాల్ గజ్జర్‌తో మాట్లాడుతూ.. నీతోని ఉంటూనే నేను అందరితో క్లోజ్‌గా ఉంటున్నాను. అందరితో కలిసి ఉంటున్నాను. కానీ మీరిద్దరు మాత్రమే కలిసి తిరుగుతున్నారు. అది నీకు మంచిది కాదు. ఇంట్లో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి. మొదటి రోజు ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు అందరికీ గ్లాస్‌లో నీళ్లు ఇవ్వడం వల్లే.. నీవు నామినేషన్ నుంచి తప్పించుకొన్నావు అని అభిజిత్ అన్నాడు.
Recommended Video

మేము వెళ్లిపోయిన తర్వాత మరొకరితో ఇలానేనా?
ఇప్పుడంటే నేను, అఖిల్ ఉన్నాం కాబట్టి నీకు తెలియడం లేదు. ఒకవేళ నేను, అఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోతే పరిస్థితి ఏమిటి? మేము వెళ్లిపోయిన తర్వాత మరొకరితో ఇలానే బిహేవ్ చేస్తావా? అంది మంచిది కాదు. నీకు నచ్చిన వారితో క్లోజ్‌గా ఉంటూనే అందరితో మంచి కలిసిపోవాలి అని మోనాల్‌కు అభిజిత్ క్లాస్ పీకాడు.


Click it and Unblock the Notifications











