బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 సెలబ్రిటీలు వీరేనట.. మీడియాలో జాబితా లీక్

కరోనావైరస్ దెబ్బ కేవలం సినీ పరిశ్రమపైనే కాకుండా టెలివిజన్ రంగంపై కూడా భారీ ప్రభావాన్ని చూపింది. దేశవ్యాప్తంగా వినోద పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేలా చేసింది ఈ ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ దేశాల్లో ఊహించని పరిస్థితులు చోటుచేసుకోవడం, పలు దేశాల్లో లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొనడంతో పలు కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. అందులో తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో కూడా ఒకటి.. తాజాగా ఈ షో గురించి ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే..

లాక్‌డౌన్ తర్వాత

లాక్‌డౌన్ తర్వాత

లాక్‌డౌన్ తర్వాత బిగ్‌బాస్ తెలుగు షోను పట్టాలెక్కించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నట్టు తెలిసింది. కరోనా లాంటి పరిస్థితులు చోటుచేసుకోకపోతే తెలుగు టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తే బిగ్‌బాస్ ప్రారంభమయ్యే అవకాశాలుండేవి. అయితే లాక్‌డౌన్ తర్వాత ఈ షోను లేటుగానైనా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

తెలుగు, తమిళ షోలకు భారీగా ఏర్పాట్లు

తెలుగు, తమిళ షోలకు భారీగా ఏర్పాట్లు

ఇప్పటికే తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన ఏర్పాట్లు, సెలబ్రిటీల ఎంపిక అంశం కూడా జోరందుకొన్నదని, కరోనా ప్రభావం తగ్గిన వెంటనే తెలుగు, తమిళంలో షోలను ప్రారంభించేలా చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే హోస్టులు, సెలబ్రిటీలతో అవగాహన ఒప్పందాల దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కరోనా పరిస్థితులు అదుపులోకి రాగానే షోను ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.

నాగార్జుననే హోస్ట్‌గా

నాగార్జుననే హోస్ట్‌గా

ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎన్టీఆర్ తొలి సీజన్‌కు, నాని రెండో సీజన్‌కు, నాగార్జున మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే నాలుగో సీజన్‌కు హోస్ట్ మారుతున్నారనే విషయాన్ని నిర్వాహకులు ఖండించారు. ఒకవేళ నాలుగో సీజన్ మొదలైతే దానికి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తారని కన్పర్మ్ చేశారు.

సెలబ్రిటీలతో చర్చలు షురూ..

సెలబ్రిటీలతో చర్చలు షురూ..

కరోనా పరిస్థితులకు ముందే సీజన్ 4 కు సంబంధించిన పనులపై కసరత్తు జరిగిందని, లాక్‌డౌన్ కారణంగా ఆ ప్రక్రియ నెమ్మదించిందని షో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ షో కోసం చాలా మందితో కూడిన సెలబ్రిటీల జాబితాను సిద్ధం చేశారని, అందులో నుంచి కొందరితో సంప్రదింపులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. అయితే ఆ జాబితాకు సంబంధించిన లిస్టు ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ప్రచారంలో ఉన్న సెలబ్రిటీల జాబితా

ప్రచారంలో ఉన్న సెలబ్రిటీల జాబితా

బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రధానంగా పరిశీలనలో ఉన్నవారిలో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్ పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరితో చర్చలు పూర్తయ్యాయని, వారికి సంబంధించిన రెమ్యునరేషన్ల విషయంపై రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనేది తెలిసింది.

టెలివిజన్ తారలు, యాంకర్లు, ఇతర ప్రముఖులు

టెలివిజన్ తారలు, యాంకర్లు, ఇతర ప్రముఖులు

ఇక ఇదే జాబితాలో కార్తీక దీపం ఫేం దీప పేరు కూడా టాప్ లిస్టులో ఉందనేది ఇన్‌సైడ్ టాక్. ఇంకా కొంత మంది యాంకర్లు, హాస్య నటులను, ఇంకా ఓ శృంగార తారను, కొందరు సామాజిక కార్యకర్తలను కూడా నిర్వాహకులు సంప్రదించినట్టు తెలుస్తున్నది. అయితే కొందరు తమకు ఉన్న కమిట్‌మెంట్స్ దృష్టా సానుకూలంగా లేరని, వారి స్థానంలో మరికొందరిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.

జాబితాపై అనుమానాలు

జాబితాపై అనుమానాలు

అయితే బిగ్‌బాస్ సీజన్ 4 కోసం అని బయటకు వచ్చిన జాబితాలో కొందరు ఇప్పటికే పలు షోలతో బిజీగా ఉన్నారు. వాటిని మధ్యలో అపేసి వచ్చే పరిస్థితి మాత్రం కనపించడం లేదు. అయితే తాజా జాబితాలోని పేర్లు ఎంత వరకు వాస్తవం అనే విషయంపై చర్చ జరుగుతున్నది. బిగ్‌బాస్ సెలబ్రిటీల ఎంపిక సీక్రెట్ కావడంతో వీరు రానున్న షోలో ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X