ఇలా వచ్చిందో లేదో అలా ఎలిమినేషన్: నామినేట్ కాకున్నా దేవీ నాగవల్లికి తప్పని కష్టాలు.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపును దక్కించుకుంది బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇప్పటి వరకు ప్రసారం అయిన షోలలోనే డిఫరెంట్ థీమ్‌తో నడిచే దీనికి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకే తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, నాలుగో దానిని కూడా ప్రారంభించేసింది. షో ఇలా మొదలైందో లేదో నామినేషన్ రూపంలో హౌస్‌‌లో రచ్చ మొదలైంది. అదే సమయంలో నామినేషన్‌లో లేకున్నా... బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ దేవీ నాగవల్లికి కష్టాలు మొదలయ్యాయి. ఆ వివరాలు మీకోసం.!

ఎంతో గ్రాండ్‌గా.. ఏకంగా పదహారు మంది

ఎంతో గ్రాండ్‌గా.. ఏకంగా పదహారు మంది

బిగ్ బాస్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న నాలుగో సీజన్... గత ఆదివారం ప్రారంభం అయింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభ ఎపిసోడ్‌ను హోస్ట్ నాగార్జున అద్భుతంగా నడిపించాడు. ఆయన డబుల్ యాక్షన్‌కు తోడు కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌లతో ఆ ఎపిసోడ్ సందడిగా సాగింది. ఇక, ఈ సీజన్ కోసం ఏకంగా పదహారు మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు.

లోపలికి వెళ్లిన వాళ్ల లిస్ట్.. ఇద్దరు మాత్రం

లోపలికి వెళ్లిన వాళ్ల లిస్ట్.. ఇద్దరు మాత్రం

బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటిగా హీరోయిన్ మోనాల్ గజ్జర్ వెళ్లింది. ఆ తర్వాత వరుసగా సూర్య కిరణ్, దేవి నాగవల్లి, లాస్య మంజునాథ్, హీరో అభిజీత్, జోర్దార్ సుజాత‌, మెహబూబ్ దిల్సే, అలేఖ్య హరిక, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయెల్ సీన్, దివ్య వధ్య (దివి), అఖిల్ సార్థక్, గంగవ్వ ఎంటర్ అయ్యారు. సైయద్ సోహాలి, యాంకర్ అరియానా గ్లోరీ మాత్రం సీక్రెట్ రూమ్‌కు వెళ్లారు.

మొదటి రోజే లేడీస్ గొడవతో రచ్చ స్టార్ట్

మొదటి రోజే లేడీస్ గొడవతో రచ్చ స్టార్ట్

బిగ్ బాస్ సీజన్ 4 ఇలా మొదలైందో లేదో... హౌస్‌లో గొడవలు స్టార్ట్ అయిపోయాయి. లేడీ కంటెస్టెంట్లు కరాటే కల్యాణీ, జోర్ధార్ సుజాత ఫోన్ కాల్ విషయంలో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో చాలా మంది కలుగజేసుకున్నా డిస్కర్షన్ ఆగలేదు. కొద్ది సేపటికి సుజాత కామ్ అయినా.. కల్యాణీ మాత్రం చాలా సేపు దీనిని ప్రస్తావించింది. ఆ తర్వాత ఆమె కూడా వెనక్కి తగ్గింది.

కిటికీ తలుపులతో సరికొత్త నామినేషన్

కిటికీ తలుపులతో సరికొత్త నామినేషన్

ఈ రియాలిటీ షోలో నామినేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటుంది. దీనిని కొనసాగిస్తూ నాలుగో సీజన్ మొదటి వారం కూడా వినూత్నంగా నిర్వహించారు. ఇందులో భాగంగా.. కంటెస్టెంట్లను ఏడు జంటలగా చేసిన బిగ్ బాస్... ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయమని మిగతా సభ్యులకు చెప్పాడు. ఇందుకోసం ఆ సభ్యుడి మీద కిటికీ తలుపులు మూయమని ఆదేశించాడు.

గంగవ్వతో పాటు ఆరుగురు నామినేట్

గంగవ్వతో పాటు ఆరుగురు నామినేట్

ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ప్రక్రియలో పద్నాలుగు మందికి గానూ (ఇద్దరు సీక్రెట్ రూమ్‌లో ఉన్నారు) ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వతో పాటు అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాతలు ఉన్నారు. సోమవారం ఎపిసోడ్ పూర్తయినప్పటి నుంచే ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయిన విషయం తెలిసిందే.

ఇలా వచ్చిందో లేదో అలా ఎలిమినేషన్

ఇలా వచ్చిందో లేదో అలా ఎలిమినేషన్

ఆదివారం జరిగిన ప్రారంభ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ దేవీ నాగవల్లి. తనది రాజమండ్రి అని, పర్సనల్ లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన ఆమె... ఇప్పటి వరకూ లేడీ బిగ్ బాస్ ఎవరూ కాలేదని, అది తానవుతానని వెల్లడించింది. ఇలా హౌస్‌లోకి వెళ్లిందో లేదో... దేవీ నాగవల్లికి భారీ షాక్ తగిలింది.

Recommended Video

Amaram Akhilam Prema Movie Team Chit Chat With Nagarjuna
నామినేట్ కాకున్నా తప్పని కష్టాలు.!

నామినేట్ కాకున్నా తప్పని కష్టాలు.!

దేవీ నాగవల్లి ఈ వారం జరిగిన నామినేషన్‌లో సేఫ్ అయింది. అయినప్పటికీ.. ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమమే జరుగుతోంది. ఇందుకోసం ట్విట్టర్‌లో కొందరు #Eliminatedevinagavalli అనే హ్యాష్ ట్యాగ్‌ను సైతం ట్రెండ్ చేశారు. దీంతో ఆదిలోనే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ లేడీ యాంకర్ ఇంటా బయట ఎలా నెగ్గుకొస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X