బిగ్‌బాస్ షో‌కు కరోనా భయాలు.. ప్రారంభానికి ముందే క్వారంటైన్‌లోకి

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభానికి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరో వైపు బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్వహకులు చర్యలు తీసుకొంటున్నారు. అయితే కరోనా సమయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఎండమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Bigg Boss 4 Telugu Official Announcement,Contestants List Goes Viral || Oneindia Telugu
 నాగార్జున ప్రోమో షూట్

నాగార్జున ప్రోమో షూట్

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ సీజన్ 4ను ఆగస్గు 30న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇటీవల నాగార్జునతో ప్రోమో షూట్‌ను పూర్తి చేశారు. ఇక కంటెస్టెంట్ల ఎంపికపై కూడా కసరత్తు పూర్తయిందనే తాజా సమాచారం. అయితే ఇంతకు ముందులా కాకుండా కంటెస్టెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు నిర్వాహకులకు పేర్కొన్నారు.

మొత్తం 30 మందిని ఎంపిక

మొత్తం 30 మందిని ఎంపిక

ఇప్పటికే 16 ప్రధాన కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా మరి కొంత మందిని కూడా స్టాండ్ బైగా ఎంపిక చేసుకొన్నాం. ఒకవేళ ఎవరైనా ఎలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడినా గానీ వారి స్థానంలో మరొకరిని ఇంటిలోకి పంపేందుకు చర్యలు తీసుకొంటున్నాం అని నిర్వాహకులు వెల్లడించారు.

16 మందికి కరోనా పరీక్షలు

16 మందికి కరోనా పరీక్షలు

ఇక 16 మంది కంటెస్టెంట్లకు ఇప్పటికే కరోనా, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళా కంటెస్టంట్లకు రెగ్యులర్‌గా నిర్వహించే ప్రెగ్నెన్సీ టెస్టులు, ఇతర హెల్త్ చెకప్స్‌తోపాటు కోవిడ్ - 19 పరీక్షలు నిర్వహించగా, అందరికీ కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్టు సమాచారం.

 కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించే అవకాశం

కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించే అవకాశం

ఇక నెగిటివ్ రిపోర్టులు వచ్చిన 16 మంది కంటెస్టెంట్లను త్వరలోనే క్వారంటైన్‌కు తరలిస్తారని, వారందరూ ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకుల పర్యవేక్షణలో రహస్య ప్రదేశానికి తరలిస్తారని తెలిసింది. అయితే షో ప్రారంభానికి ముందు కూడా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి వారిని ఇంటిలోకి పంపే విధంగా సురక్షిత చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.

కలర్ ఫుల్‌గా బిగ్‌బాస్ హౌస్

కలర్ ఫుల్‌గా బిగ్‌బాస్ హౌస్

తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ షోను గతంలో కంటే మరింత గ్లామర్‌గా చూపేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. లాక్‌డౌన్ కొనసాగుతుండగా షూటింగులు లేకపోవడంతో ఓ రేంజ్ ఉన్న హీరో, హీరోయిన్లు బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు రెడీగా ఉండటంతో, అలాంటి వారిని ఈ సారి ఎంపిక చేసినట్టు తెలిసింది. యాంకర్లు మంజూష, వర్షిణి లాంటి వారితోపాటు పలువురు హీరోయిన్లు ఈ షోలో కనిపిస్తారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X