బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌పై చెలరేగుతున్న రూమర్లు.. అసలేం జరుగుతున్నదంటే..

కరోనావైరస్ లాక్‌డౌన్‌తో పలు షూటింగులు వాయిదా పడటంతో సినీ, టెలివిజన్ పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 4 అసలు స్టార్ట్ అవుతుందా? లేదా అనే ప్రశ్నలు వెంటాడాయి. అయితే లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు సానుకూలంగా స్పందించడంతో బిగ్‌బాస్‌ తెలుగు 4కు కూడా మార్గం సుగమైంది. బిగ్‌బాస్ 4పై రూమర్లపై నిర్వాహకులు స్పందిస్తూ..

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
రద్దు వార్తలన్నీ అవాస్తవాలు

రద్దు వార్తలన్నీ అవాస్తవాలు

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 రద్దు అయినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఇంకా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షోకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వర్కంతా సాగుతున్నది. లాక్‌డౌన్‌లో కూడా బిగ్‌బాస్‌కు సంబంధించిన పనులను ముందుకు నడిపించాం. లాక్‌డౌన్ తర్వాత తాము ఎప్పుడంటే అప్పుడు షోను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. రూమర్లను నమ్మవద్దు అని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వహకులు మీడియాతో పంచుకొన్నారు.

పరిస్థితులు చక్కబడితే..

పరిస్థితులు చక్కబడితే..

అయితే లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడితే జూలై చివరి వారంలో గానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ బిగ్‌బాస్ ప్రారంభిస్తాం. ఒకవేళ పరిస్థితులు చేజారితే.. అవి సర్దుకునేంత వరకు వేచి చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ షోను ప్రారంభించేందుకే ప్రయత్నిస్తాం. మా వైపు నుంచి మేము సానుకూలంగానే ఉన్నాం అని నిర్వాహకులు పేర్కొన్నారు.

హోస్ట్‌గా నాగార్జునే..

హోస్ట్‌గా నాగార్జునే..

ఇక హోస్ట్ ఎవరన్న విషయంపై వస్తున్న రూమర్లను నిర్వాహకులు కొట్టిపడేశారు. హోస్ట్‌గా నాగార్జున కొనసాగుతారు. ఆ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. హోస్ట్ మారుస్తారనే వార్తలన్నీ రూమర్లే. ఇప్పటికే హోస్ట్‌గా నాగార్జునతో అన్ని విషయాలు చర్చించాం. ఆయన కూడా షో స్టార్ అయితే వేదికపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని నిర్వాహకులు తెలిపారు.

 భారీ ప్రైజ్‌మనీతో

భారీ ప్రైజ్‌మనీతో

తెలుగులో బిగ్‌బాస్ తెలుగు షోకు విశేషమైన ప్రేక్షకాదరణ ఉంది. గత మూడు సీజన్లలో ఈ షోకు మంచి టీఆర్పీ రేటింగులు వచ్చాయి. దాదాపు మూడు నెలలపాటు సాగే బిగ్‌బాస్ షోలో 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారు. బిగ్‌బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X